మళ్ళీ రావా సినిమా ఎలా వుంది?
చాలా బావుంది.
అందరికీ నచ్చుతుందా?
మాస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాని, మిగతా వాళ్ళకు కచ్చితంగా నచ్చుతుంది.
కిడ్స్ మీద లవ్ స్టొరీ నడపటం ఇబ్బందికరంగా వుందా?
అసలు ఇబ్బందికరమైన సీన్స్ లేవు. అసలు కిడ్స్ మధ్య లవ్ ఫీలింగే ఇబ్బందికరం అనుకుంటే కిడ్స్ తో చూడొద్దు.
ఈ సినిమా ప్రతేకత ఏమిటి?
స్క్రీన్ ప్లే. ఒక కథను మూడు భాగాలు చేసి కన్‌ఫ్యూజన్ లేకుండా కథ చెప్పిన తీరు అత్యద్భుతం.
కథ ఏమిటి?
ఒక ప్రేమ కథ.
సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ వుందా?
వుంది
సుమంత్ ఎలా చేసాడు? హిరోయిన్ ఎలా చేసింది?
బాగా చేసారు. హిరోయిన్ బాగుంది.
మిగతా యాక్టర్స్ ఎలా చేసారు?
అన్నపూర్ణ తప్ప అందరూ కొత్తవాళ్ళే. అందరూ బాగా చేసారు.
హైలట్స్ ఏమిటి?
1) హిరోయిన్ హిరో గురుంచి రియలైజ్ అయ్యే సన్నివేశం 2 ) హిరోయిన్ కు తండ్రి అంటే ఇష్టం లేకపొయినా తండ్రిని ఎందుకు ఎంచుకుందనే పాయింట్ 3) హిరో ఒక జులాయని ఎంతో ద్వేషించే అన్నపూర్ణ, ఎప్పటి నుండి హిరోను గౌరవించడం మొదలు పెట్టిందో చెప్పిన సన్నివేశం .. ఇంకా చాలా వున్నాయి.
ఏమి బాగోలేదు?
బాగోలెదు అని కాదు. 1) అంతా కొత్తవాళ్ళు.వాళ్ళు అలవాటు అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. 2) స్క్రీన్‌ప్లే కు కనెక్ట్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం పట్టింది. .. ఒక్కసారి ఎడ్జస్ట్ అయ్యాక సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. క్లైమాక్స్ సూపర్.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.