పవన్ కల్యాణ్ దృష్టిలో శ్రీ కత్తి మహేష్ ఒక మేధావి. నిస్సాహాయ మేధావి. తన మేధావితనంతో ఏమి చెయ్యాలో తెలియక పవన్ కల్యాణ్ ను ఎటాక్ చేస్తున్నాడని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడు.
అటు మీడియా కాని, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళు కాని, తమ అభిప్రాయాలకు కొద్దిగా స్పైస్ యాడ్ చేసి జనాల మీదకు వదులుతూ వుంటారు. ఎక్కువ మందికి రీచ్ అవుద్దని వారి ఆశ. అదే వుద్దేశంతో “పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో వూగిపొవడం మినహా ఏమి పీకాడు?” లాంటి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేసాడు. మరీ రాంగోపాలవర్మ అంత కాకపొయినా, కొద్దిగా రాంగోపాలవర్మ తరహాలో అనుకోవచ్చు.
కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఎక్సపెట్ చేసినట్టుగానే ఫ్యాన్స్ రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసారు. కత్తి మహేష్, జీవితా-రాజశేఖర్ లను మించిన సెలబ్రిటి అయిపొయాడు. ఫ్యాన్స్ తగ్గడం లేదు, ఈయన తగ్గడం లేదు. రోజు రోజుకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి తన వ్యాఖ్యల డోస్ పెంచుతున్నాడు.
తెలిసి చేసాడో, తెలియక చేసాడో, తెలివే కాదు దమ్ము కూడా వుందని నిరూపించాలనుకున్నాడో, మన దేశ ప్రధానమంత్రినే నరహంతకుడు అనేసాడు.