ఈరోజే ‘గాలి వాలుగా’ సాంగ్ రిలీజ్

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందించారు.  ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే “బయటకొచ్చి చూస్తే” పాటను విడుదల చేసారు. త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు విడుద‌లైన ఈ పాట‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. అనిరుధ్ పాడిన ఈ గీతానికి శ్రీ‌మ‌ణి సాహిత్య‌మందించారు.

రెండో సింగిల్ గా “గాలి వాలుగా” పాట‌ని ఈరోజు డిసెంబర్ 12న విడుద‌ల కాబోతుంది.  ఈరోజు అని చెప్పినా టైం చెప్పలేదు ఈ చిత్ర యూనిట్. గత మూడు రోజుల నుంచి కౌంట్ డౌన్ చేస్తున్నా, రాజకీయ ప్రవాహంలో ఫ్యాన్స్ పెద్ద పట్టించుకోలేదు. గత మూడు రోజుల నుంచి చేయవలసిన్ హంగామా ఈరోజు చేయనున్నారు.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.