Suresh Kondi @V6_Suresh
Video of #GaaliVaaluga will be released tomorrow at 9 am. #PSPK25 #Agnyaathavaasi #GaaliVaalugaOutNow
సోషల్ నెట్‌వర్క్ ప్రభావంతో ప్రస్తుతం తెలుగుసినిమాల పబ్లిసిటీ స్ట్రాటజీనే అనూహ్యంగా మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ .. ఇలా ఒక్కొక్కటిగా సోషల్ నెట్ వర్క్ లో రిలీజ్ చెయ్యడం ట్రెండ్. బాహుబలి అయితే, సినిమాలో వున్న ప్రతి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, ప్రేక్షకుల్లో ఎవరూ ఊహించని రేంజ్ హైప్ క్రియేట్ చేయగల్గారు.
అజ్ఞాతవాసి ప్రమోషన్లో భాగంగా ఫస్ట్, సెకండ్ లుక్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, ఫస్ట్ టీజర్ అయిపొయాయి. నిన్న రిలీజ్ చేసిన ‘గాలి వాలుగా ఓ గులాబి వాలి గాయమైనదీ..’ ఆడియో సాంగ్ కు సంబంధించిన విడియో విజువల్స్ ఈరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నారట.