“శేఖర్ కమ్ముల” మినహా ఫిదా సినిమా అంత సంచలనమైన విజయం నమోదు చేసుకుంటుందని, ఆ సినిమా నిర్మించిన దిల్ రాజు కూడా ఊహించలేదు. నార్మల్ గా దిల్ రాజు ఏ సినిమా రేంజ్ అయిన ముందుగానే పసిగట్టగలడని పేరుంది. ఫిదా విషయంలో ఫెయిల్ అయ్యాడు.
“శేఖర్ కమ్ముల” ప్రిరిలీజ్ ఇంటర్వ్యూస్ లో సంచలన విజయం సాధిస్తుందని చెపితే, చాలామంది అవహేళన చేసారు. అందరూ చేప్పే సోది కదా అని పెద్దగా పట్టించుకోలేదు.
అఖిల్ “Hello” పరిస్థితి కూడా ఎక్జాక్ట్ గా అలానే వుంది. నాగార్జున “కొడుతున్నాం గట్టిగా కొడుతున్నాం” అనే మాటలు కొద్దిగా అతిగా వున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- పాటలు నాగార్జున చెప్పిన మాటలకు ఏం మాత్రం తక్కువ లేవు
- పబ్లిసిటీ బాగా చేస్తున్నారు
- విజువల్స్ స్టన్నింగ్ గా వున్నాయి (ట్రైలర్ & సాంగ్స్)
- హిరొయిన్ అఖిల్ పక్కన సరిగ్గా సరిపోయింది
- దర్శకుడు విక్రమ్ కుమార్ టాలెంట్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “మనం” సినిమా ఒక్కటి చాలు . టాక్ తొ సంబంధం లేకుండా అతని సినిమాలన్నీ మిస్ అవ్వకుండా థియేటర్లో చూడోచ్చు.