రాజధానికి ఇది అవసరమా? కాదా ? అన్నది ప్రభుత్వం నిర్ణయం. ఇలా కాదు అలా అని ప్రతిపక్షం విమర్శలు చెయ్యడం షరా మాములైన విషయం. వాటితో రాజామౌళికి సంబంధం లేదు.
రాజమౌళిని ముఖ్యమంత్రి ఒక సలహా అడిగారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు రాజమౌళి ఒక ఐడియా ఇచ్చారు. రాజమౌళి 🙏🙏🙏.
2వేల సంవత్సరాలుగా గుడిమల్లం పరుశురామ ఆలయం, పుదుచ్చేరిలోని మాద్రి మందిర్‌లో సూర్య కిరణాలు ఎలా పడుతున్నాయో ఆధ్యాయనం చేసి, అదే రీతిలో అసెంబ్లీ భవనంలో తెలుగుతల్లి విగ్రహం విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని రాజమౌళి ఒక ఐడియా ఇచ్చారు. నవ్యాంధ్ర రాజధానిలో అసెంబ్లీ భవనంపై ఏర్పాటు చేసే అద్దాలపై సూర్య కిరణాలు పడి సరిగ్గా 9.15ని॥ అసెంబ్లీ సెంట్రల్ హాలులోని తెలుగుతల్లి విగ్రహం పాదాలను ఎలా తాకాలో వివరించారు.
దీనికోసం ప్రత్యేకంగా ఒక విడియో తయారు చేసారు. విజువలైజేషన్ కి ప్రశంసలు వస్తున్నాయి. రాజమౌళి 🙏🙏🙏.