‘అజ్ఞాతవాసి’ టీజర్‌ ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌

  1. గంగానది నది ఒడ్డున ఉన్న కాశీ పట్టణం మీదుగా కెమెరా పాన్‌ అవుతూ నిర్మాణ సంస్థ లోగో కనిపిస్తుంది.
  2. చీకటిగా ఉన్న ఓ పెద్ద భవనంలోకి ద్వారం గుండా సూర్య కిరణాలు పడుతుంటాయి. ఆ కిరణాలతో పాటే ఓ యువకుడు నడుచుకుంటూ వస్తాడు. ఆ నడక చూస్తే అది పవన్‌ అని చెప్పడం పెద్ద కష్టం కాదు.
  3. పాశ్చాత్యం, భారతీయ సంప్రదాయ నృత్యాలను చేస్తున్న కొంతమంది యువతను రెండు వరుస ఫ్రేమ్‌ల్లో చూపిస్తారు.
  4. పచ్చదనం నిండిన ఓ కొండపై దూరంగా ఓ బస్సు… దాని వెనుక నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కనిపిస్తారు. అదీ పవన్‌ కల్యాణే.
  5. డోలు పట్టుకొని కొందరు కుర్రాళ్లు ఆటకు సిద్ధమవుతుంటే… వాళ్లకు ముందు ఓ డోలు మీద ఎర్రని రంగు ఉంటుంది.
  6. వాళ్ల మధ్యలోంచి రెండో ఫ్రేమ్‌లో కనిపించిన కుర్రాడే మళ్లీ నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడా ఫేస్‌ కనిపించదు.
  7. ఓ వ్యక్తి మోకాలు మీద కూర్చుంటే… ఆ కాలి మీద ఎక్కి ఓ యువకుడు ముందు ఉన్న పొదలను దాటుతాడు. అప్పుడు కనిపిస్తుంది పవన్‌ ముఖం. ఇదే థియేటర్‌లో అయితే విజిల్స్‌ మోతమోగుతాయి.
  8. పొదలు దాటుతుండగానే ఓ నలుగురు బౌన్సర్లు ఆ రోడ్డును ఖాళీ చేస్తుంటారు. అదీ అలా ఇలా కాదు… అటుగా ఓ వ్యక్తి బైక్‌ మీద వెళ్తుంటే… ఒకడు బైక్‌ లాగేస్తాడు. మరొకడు ఆ మనిషిని లాగేస్తాడు. పైన విమానం ఎగురుతుంటుంది.
  9. ఇప్పుడు హీరోలోని యాక్షన్‌ కోణం. వందల మంది రౌడీల మధ్యలో ఓ టాప్‌ రౌడీ హీరో మీద దాడి చేయాలని చూస్తే… అతడి చేతిలోని కత్తినే తీసుకొని వాడి చేతి నరాలను కట్‌ చేస్తాడు పవన్‌.
  10. ఆ తర్వాత షాట్‌లో చైనుతో కొడదామని చూసిన మరో విదేశీ రౌడీని అదే చైను మెలితిప్పి రౌడీని నేల మీద గిరాటేస్తాడు. ఇంకేముంది కింద ఫ్లోర్‌ తునాతునకలైపోతుంది.
  11. మురళీ శర్మ ఏదో అంటే… పవన్‌ తన ట్రేడ్‌మార్క్‌ ఏడుపుతో చూసినవాళ్లకు నవ్వు వచ్చేలా చేస్తాడు. ఆ వెనుక రావు రమేష్‌ మాత్రం ఏమీ అర్థం కానట్లు చూస్తుంటాడు.
  12. ఎవరో పరిచయం చేసుకుంటుంటే… పవన్‌ మొహమాటంతో వాళ్లకు నమస్కారం చేయడం తర్వాతి ఫ్రేమ్‌
  13. రిలీజ్‌ డేట్‌ చెబుతూ విడుదల చేసిన ‘బయటికెళ్లి చూస్తే టైమేమో’ వీడియో చూశారుగా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్‌ నడుస్తూ వెళ్లడం ఆ తర్వాత ఫ్రేమ్‌.
  14. నెక్ట్స్‌ ఫ్రేమ్‌లో పవన్‌ నడక పచ్చని పొలాల మధ్య సాగుతుంది. ఆ తర్వాత విదేశంలో ఓ పెద్ద కంపెనీ ఎదురు రోడ్డు మీదుగా కొనసాగుతుంది.
  15. ఇప్పుడు సెల్ఫీ టైమ్‌. పవన్‌, అను ఇమ్మాన్యుయేల్‌, మురళీ శర్మ, రావు రమేష్‌ కలసి ఓ సెల్ఫీ దిగుతారు.
  16. ఇక పవన్‌ రొమాంటిక్‌ యాంగిల్‌. ఓ రెస్టారెంట్‌లో హీరోయిన్‌ ఎదురుగా కూర్చొని ముద్దు గురించి ఏదో మాట్లాడుతూ కనిపిస్తాడు.
  17. ఆ తర్వాత వారణాసిలో అఘోరాల మందు నడుస్తూ… సీరియస్‌ కనిపిస్తాడు.
  18. ఓ పెద్ద కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎవరో పెద్దావిడ ఏదో విషయం గురించి మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె కుష్బూ అని తెలుస్తోంది.
  19. టీజర్‌ ఇక్కడి నుంచి బ్లాక్‌ అండ్‌ వైట్‌లోకి వెళ్లిపోయింది. ఓ బిల్డింగ్‌ కిటికీల నుంచి అజయ్‌, రావు రమేష్‌, సమీర్‌, బొమన్‌ ఇరానీ బయటకు చూస్తూ కనిపిస్తారు. ఇది ఫ్లాష్‌బ్యాక్‌ కానీ, సిట్యువేషన్‌ బ్లాక్‌ స్టేజ్‌లో కానీ ఉండొచ్చు.
  20. సినిమా టైటిల్‌ లోగోలో పవన్‌ ఓ కిటికీ నుంచి బయటకు చూస్తూ కనిపిస్తాడు. ఆ షాట్‌ టీజర్‌లో ఇప్పుడు వస్తుంది.
  21. ఇప్పుడు అజ్ఞాతవాసి అని టైటిల్‌ పడుతుంది.
  22. మొన్నీమధ్య వచ్చిన ఓ స్టిల్‌లో పవన్‌ బుగ్గల్ని కీర్తి సురేష్‌ లాగుతూ కనిపించింది. ఆ సీన్‌ను నెక్ట్స్‌ ఫ్రేమ్‌లో చూడొచ్చు.
  23. ఒక హీరోయిన్‌ చూశాక… మరి ఇంకో హీరోయన్‌ను కూడా చూడాలిగా… ఈసారి లొకేషన్‌ ఫారిన్‌. పవన్‌ ఒడిలోకి మెల్లగా జారుతూ అను కనిపిస్తుంది.
  24. సినిమా మీద హైప్‌ను అమాంతం పెంచిన పోస్టర్‌ గుర్తుందా… అదేనండి ఐడీకార్డు పట్టుకొని సోఫాలో కూర్చున్న పవన్‌ ఫొటో. దానికి వీడియో వెర్షన్‌ టీజర్‌లో నెక్ట్స్‌ ఫ్రేమ్‌.
  25. టీజర్‌లో పవన్‌ చెప్పిన ఏకైక డైలాగ్‌… ‘ఓ మై గాడ్‌’. ఆ సీనే తర్వాత ఫ్రేమ్‌.
  26. దీని తర్వాత ఇద్దరు హీరోయిన్లు కీర్తి, అనును పవన్‌ హగ్‌ చేసుకునే సీన్లు వెంటవెంటనే వస్తాయి.
  27. ఓ ఆఫీస్‌లో పవన్‌ విచిత్రమైన హావభావాలు చేస్తుంటే… ‘వీడి చేష్టలు వూహాతీతం వర్మ’ అని మురళీ శర్మ అంటారు. దానికి ‘దటీజ్‌ ద బ్యూటీ’… అని రావురమేష్‌ కౌంటర్‌ వేస్తాడు. దాంతో టీజర్‌ పూర్తవుతుంది.

Source: eenadu.net

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.