విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం హల్లో. అక్కినేని నాగార్జున నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 22 రిలీజ్ కానున్నది. ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా నాగార్జున అక్కినేని హల్లో కథ అవుట్ లైన్ ఏమిటనేది చెప్పేసాడు.
- ఒకరోజులో జరిగే కథ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే కథ. కాకపొతే చిన్నప్పటి చిన్న ప్లాష్‌బ్యాక్ వుంటుంది
- చిన్నతనంలోనే మంచి స్నేహితులైన అబ్బాయి, అమ్మాయి విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఫొన్ నంబర్ ఇచ్చి వెళుతుంది.
- దాదాపు 15 సంవత్సరాలుపాటు హీరోయిన్‌కు హీరో ఫోన్ చేస్తుంటాడు. కానీ అమ్మాయి ఫోన్ ఎత్తదు.
- విడిపోయిన ప్రేమికులు ఎలా కలుసుకొంటారు. కలుసుకోవడానికి మధ్య ఏమి జరిగిందనేది స్ర్రీన్‌ప్లే.