జల్సా & అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా మొదలైన దగ్గర నుండే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా మురళీ శర్మ, రావు రమేష్, కుష్బూ, బోమన్ ఇరానీలు కీలక పాత్రలో నటించారు.
అమెరికాలో ఏ భారతీయ సినిమా విడుదలకాని రీతిలో అత్యధికంగా 570 కు పైగా స్క్రీన్లలో రిలీజవుతున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా కొత్త రికార్డుల్ని నెలకొల్పేందుకు సిద్దమైంది. ఒకరోజు ముందే రిలీజ్ అంటే, జనవరి 9నే రిలీజ్ చేసుకొవడానికి నిర్మాతలు పర్మిషన్ ఇచ్చారు.