పవన్ కల్యాణ్ రెండు పడవలపై ప్రయాణం

పవన్‌ కల్యాణ్‌  కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’.  కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. రు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కేరింతల మధ్య అట్టహాసంగా జరిగింది.

పవన్ కల్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. సినిమాలు .. రాజకీయాలు .. ఇది చాలా కష్టమైన పని. దేనికి పూర్తిగా న్యాయం చెయ్యలేరు. ఈరోజు పవన్ కల్యాణ్ స్పీచ్ విన్నవాళ్ళకు ఎవరికైనా అర్దం అవుతాది.

తన దగ్గరకు వచ్చే సమస్యలను ఎంతో స్టడీ చేసి వాటి పరిష్కారల కోసం పని చేస్తూ వుంటాడు కాని, సినిమా షూటింగ్ గ్యాప్ లో వచ్చి, తెలుగుదేశం సూచనలతో రాజకీయాలు చేస్తూ వుంటాడని విమర్శలు వస్తూ వుంటాయి.

ఈరోజు స్పీచ్ వింటే సినిమా మూడ్‌లో లేనట్టు తెలిసిపోతుంది.  ఎదో చెప్పాలనుకొని ఎదేదో చెప్పినట్టు అనిపించకమానదు.

  1. సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఇంత అభిమానం పొందుతానని అనుకోలేదు.
  2. ఎన్ని సినిమాలు చేస్తావ్‌ అని ఇంట్లోవాళ్లు అడిగితే 10, 15 సినిమాలు చేస్తాననుకున్నా. ‘ఖుషి’ తర్వాత మరో ఐదు సినిమాలు చేసి ఆపేద్దామనుకున్నా. కానీ మీ ప్రేమ 25 సినిమాలు చేసేలా చేసింది.
  3. ‘జానీ’ అపజయం తర్వాత నేను కుంగిపోలేదు కాని, నా చూట్టూ వున్నవాళ్ళు కుంగిపోయారు.
  4. నేను అండగా నిలిచిన వారు నాకు అండగా నిలవలేదు. కానీ మీరు నిల్చున్నారు. అభిమానులు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు.
  5. సినిమాల్లో నా వెంట ఉన్న వ్యక్తి త్రివిక్రమ్‌. ఇద్దరిదీ ఒకటే భావజాలం. అందుకే కలిసి ప్రయాణం సాగిస్తున్నాం. ఆయనపై కోప్పడే సాన్నిహిత్యం నాకు ఉంది. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి ఆయన. ఈ దేశానికి ఏదో చేయాలన్న తపనను రాజేసింది గుంటూరు శేషేంద్ర శర్మ అయితే.. ఆ వ్యక్తిని పుస్తకాల ద్వారా పరిచయం చేసింది త్రివిక్రమ్‌.
  6. డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలవాల్సిన నిర్మాతలు కనుమరుగైపోతున్న సమయంలో నిర్మాత రాధాకృష్ణ గారు దొరికారు. పాతకాలపు విలువల్ని ఆయన తిరిగి తీసుకొచ్చారు.
  7. నా ఇష్టమైన సంగీత దర్శకుడు అనిరుధ్‌. ఆయన ‘కొలెవరి’ పాటకు నేను ఒక్కడినే ఉన్నప్పుడు డ్యాన్స్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి.
  8. చిన్నప్పటి నుంచి ఆది పినిశెట్టి నాకు తెలుసు.
  9. కథానాయికల సిన్సియారిటీని అభినందిస్తున్నా.
  10. ఈ సినిమా కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు పనిచేశారు.

bottomline:

పవన్ కల్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నందున్న వలన,  దేనికి పూర్తిగా న్యాయం చేయలేకపొతున్నాడన్నది నిజం.  ఏమి మాట్లాడనుకున్నాడో కొద్దిగా నైనా ప్రిపేర్ అయ్యి రావాల్సింది.

అందరి చేత, భారత్ మాతా కీ .. జై .. అనిపించడం కేక .. goose bumps

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.