సినిమా బాగుందా? చూడొచ్చా?
బాగుంది. నాకు నచ్చింది. ఒక్కసారి కచ్చితంగా చూడొచ్చు.
ఏమి బాగోలేదు?
దిక్కుమాలిన స్టోరి. దిక్కుమాలిన బెట్టింగ్. దిక్కు మాలిన కథకు ముగింపు కోసం(pre climax), అంత పెద్ద న్యూస్ తెలియనట్టు భూమిక నానిని చెంప మీద కొట్టడం బాగోలేదు. కీలకమైన లాజిక్స్ బాగోలేదు.
స్టోరి బాగోకపొతే దేనికోసం ఒక్కసారి కచ్చితంగా చూడాలి?
దిక్కుమాలిన స్టోరి అయినా దిక్కుమాలిన బెట్టింగ్ అయినా, కథను నడిపిన తీరు బాగుంది, హిరో గెలిచిన తీరు బాగుంది(గ్యాస్ బండ సీను మినహా). విలన్ మారిన తీరు బాగుంది. విలన్ ను మంచోడిగా మార్చిన ఒక తల్లి నమ్మకం బాగుంది. క్లైమాక్స్ బాగుంది.
నాని ఎలా చేసాడు?
ఒన్ మేన్ షో అనోచ్చు. ఏ మాత్రం తగ్గలేదు. చాలా బాగా చేసాడు.
సాయి పల్లవి ఎలా చేసింది?
వున్నంతలో చాలా బాగా చేసిందనే చెప్పొచ్చు.
భూమిక ఎలా చేసింది?
చెయ్యడానికి ఏమీ లేదు. కాని ఇమేజ్ తో నడిచిపోయిందనొచ్చు.
పాటలు ఎలా వున్నాయి?
సొషల్ మీడియాలో ఆడియో ఫ్లాప్. దేవిశ్రీ ప్రసాద్ పెద్దగా కష్టపడకుండా, తమ్ముడి వాయిస్‌తో కలిసి జనాల మీదకు వదిలేసాడనే కామెంట్స్ వినిపించాయి. సినిమాలో మాత్రం విజువల్స్ బాగున్నాయి. లాస్ట్ సాంగ్ లో సాయిపల్లవి స్టెప్(ట్రైలర్ లో కుడా వుంది) హైలట్. మిగతా పాటల్లో కూడా నానిని సాయిపల్లవి డామినేట్ చేసింది.
bottomline:
“ప్రాణంతో చెలగాటం” కరెక్ట్ టైటిల్.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.