MCA vs Hello.
“హలో” సినిమా హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాలో చాలా వున్నాయి. సన్నివేశాలు చిత్రీకరించిన తీరుతో విక్రమ్ కుమార్, తనపై ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెంచుకున్నాడు. తన పెరఫార్మన్స్ తో అఖిల్ కచ్చితంగా నిలబడతాడని నిరూపించుకున్నాడు. ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ తో బయటకు వస్తారు ప్రేక్షకులు. “హలో” సినిమాలో ప్రేక్షకులకు రెండు అర్దం కాని విషయాలు వున్నాయి. 1) సెల్ ఫోన్ కాల్ హిస్టరీ ద్వారా చాలా ఈజీగా సంపాదించగల ఒక ఫోన్ నెంబర్ కోసం అన్ని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అవసరమా? 2) అన్ని సంవత్సరాలు తర్వాత అకస్మాతుగా వంద రూపాయల నోటు అలా ప్రత్యక్షం అవ్వడం అస్సలు కన్విన్సింగ్ గా లేదు. పై రెండు విషయాల్లో మరికొద్ద శ్రద్ద వహించి వుంటే ఇంకా మంచి పేరు వచ్చేది.
“నాని” సినిమాతో మాకు ప్రొబల్మం లేదని నాగార్జున పదే పదే చెప్పాడు. నాని పక్కన సాయి పల్లవి వుండటం, ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత అవ్వడం నాగార్జున లెక్కలు దెబ్బతిన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు.
MCA గొప్ప సినిమా కాకపొయినా, ఒక్కసారి కచ్చితంగా చూడొచ్చు. ఎవరేజ్ అని పబ్లిక్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు దిల్ రాజు కొడుతున్న డబ్బా మాములుగా లేదు. పక్కా ప్లానింగ్ తో పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ చేస్తున్నాడు. పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ విషయంలో నాగార్జున మీద దిల్ రాజు గెలిచాడు.