మెగాస్టార్ చిరంజీవి గెడ్డం తీసేసారు. చరణ్ ఫ్యామిలీ & దర్శకుడు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ విదేశాలు వెళ్ళారు. 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఆగిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి కారణం, గత వారం రోజుల నుంచి చిరంజీవి ఫస్ట్ షెడ్యూల్ అవుట్‌పుట్‌తో అసలు హ్యాపీగా లేరనే వార్తలతో పాటు, బోయపాటికి అప్పచెపుతారు, వినాయక్‌కు అప్పచెపుతారనే వార్తలు ప్రచారంలో వున్నాయి. జనవరి ఫస్ట్ రోజు గెడ్డం లేకుండా చిరంజీవి కనిపించేసరికి, ‘సై రా’ ఆగిపోయినట్టే నని కొందరు డిసైడ్ అయిపొయారు.
ఈ విషయంపై చరణ్ క్లారిటీ ఇస్తే బాగుటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.