“సిద్దు .. సిద్దార్ద రాయ్” “మైఖల్ వెలాయుధం” .. పవన్ కల్యాణ్ ఇటువంటి పేర్లను ఇష్టపడుతుంటాడు. పవన్ కల్యాణ్ కు ఇష్టమైన తరహాలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జల్సా’ సినిమాలో పవన్ పేరు సంజయ్ సాహు. ‘అత్తారింటికి దారేది’లో గౌతం నంద. ఇప్పుడు రాబోతున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ పాత్రకు అభిషిక్త్ భార్గవ అని పేరు పెట్టారట. సినిమాలో అందరూ పవన్‌ను ముద్దుగా ఏబీ(అభిషిక్త్ భార్గవ) అని పిలుస్తుంటారట.
“ho ho.. AB ఎవరో నీ బేబి” అంటూ సాగే ఒక పాట కూడా వుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు అయ్య బాబోయ్ ఇదేమి పాట అనుకున్నారు. రిపీట్ గా విన్నాక, చాలా మంది అభిమానులకు ఈ పాట ఫేవరెట్ సాంగ్ అయిపోయింది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 9/10 న రాబోతుంది.. హారిక-హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కించింది. అను ఇమ్మా్న్యుయేల్, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.