శ్రీ కత్తి మహేష్ >>> రాంగోపాలవర్మ

Kona venkat @konavenkat99
Some Jokers are taking the silence of @PawanKalyan for granted… don’t….

ప్రపంచంలో అందరూ తెలివిగలవాళ్ళే. చాలామందికి తమ తెలివితేటలతో ఏమి చెయ్యాలో తెలియక నిస్సాహాయ స్థితిలో అమాయకులుగా వుండిపొతారు. కొందరు తమ తెలివితేటలకు తగ్గ గుర్తింపు రావడం లేదనే కోపంతో ఒక పరపతి & జనాకర్షణ కలిగిన సాఫ్ట్ టార్గెట్ ఎంచుకొని కసి తీర్చుకొనే పనిలో వుంటారు. తమకు రాని గుర్తింపు సమాజంలో చెడ్డవాళ్లకు వస్తుందనే బాదతో అసహనం కొల్పోయి, తాము చేసేదంతా కరెక్టేననే భ్రమలో చెడ్డవాళ్ళకంటే చెడ్డగా ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ ఎవరూ ఏమీ చేయగల్గింది లేదు. తాము చేసేది తప్పని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే దాకా వాళ్ళను ఎవరూ మార్చలేరు.

రాంగోపాలవర్మ మేధావులకే మేధావి. రాంగోపాలవర్మను మించిన మేధావి శ్రీ కత్తి మహేష్. తెలివైన వాళ్ళను జోకర్స్ అనుకొవడం కోన వెంకట్ భ్రమ. మెయిన్ మీడియాలో రావాలంటే సాఫ్ట్ టార్గెట్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ అనే పేరు లేకపొతే వాళ్ళను ఎవరూ పట్టించుకొరు అన్నది వాళ్ళకు బాగా తెలుసు.

శ్రీ కత్తి మహేష్  తెలివైనోడు మాత్రమే కాదు, ధైర్యవంతుడు కూడా. దేశ ప్రధానినే డైరక్ట్‌గా నరహంతుకుడు అని అన్నాడు. ఇంకా పవన్ కల్యాణ్ ఎంత? .. అమాయక ఫ్యాన్స్ ను అల్లరి మూకగా అభివర్ణిస్తూ   పవన్ కల్యాణ్  కు ఎన్నెన్నో ఆపాదిస్తున్నాడు.  పాపం, తన పనెదో తాను చేసుకునే త్రివిక్రమ్ ను కుడా వదల్లేదు.

bottomline:

  1. తెలివితేటల్లో కాని, ధైర్య సాహసాల్లో కాని శ్రీ కత్తి మహేష్ >>> రాంగోపాలవర్మ. This is True.
  2. తప్పో, ఒప్పో .. ముసుగులో గుద్దులాట లేకుండా పవన్ కల్యాణ్ గురించి  శ్రీ కత్తి మహేష్ డైరక్ట్ గా తన మనసులో మాట చేప్పేస్తున్నాడు. Very Good. Please continue the same.
  3. అమాయక & నిస్సాహాయక అభిమానులు స్పందించడంలో అసలు తప్పు లేదు.
  4. శ్రీ కత్తి మహేష్ వలన పవన్ కల్యాణ్ కు జరిగే నష్టం అసలు లేదు. కారణం ఇప్పటికిపుడు అధికారం ఆశీంచడం లేదు కాబట్టి. రాజకీయంగా బొక్కమైన వుంటే అది శ్రీ కత్తి మహేష్ కు సపోర్ట్ చేస్తున్న వైయస్సర్‌సిపి కే.  రాజకీయం అంటే వర్గాలను రెచ్చగొట్టడం కాదు, సవరదీయడం అని చంద్రబాబు నుంచి ఎప్పుడు నేర్చుకుంటారో ఈ వైయస్సార్‌సిపి వాళ్ళు.
  5. అభిమానులు అసలు వర్రీ కానక్కర్లేదు. కాలమే సమాధానం చెపుతుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం. Bookmark the permalink.