పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. బోల్డంత హైప్ వుంది. కారణం సింపుల్ “పవన్ & త్రివిక్రమ్ కాంబినేషన్ “. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఆరు పాటలు క్లాస్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పవన్ పాడిన “కొడకా.. కోటేశ్వరరావు” అనే పాట జనాలను ఒక ఊపు వూపుతుంది.
ఇంత హైప్ వుంది పబ్లిసిటి వేస్ట్ అనుకున్నారు. సినిమా పబ్లిసిటీ అంటే, ట్రైలర్ లేదు సరి కదా, సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఇంకా మొదలు అవ్వలేదు. పబ్లిసిటీ ఎప్పుడు మొదలు పెడతారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.