సినిమా ఎలా వుంది? నచ్చిందా? చూడొచ్చా?
బాగానే వుంది. నచ్చింది. లాజిక్స్ పక్కన పెట్టి, డబ్బింగ్ సినిమా అని గుర్తు పెట్టుకొని, కొద్దిగా ఓపిక వుంటే కచ్చితంగా చూడొచ్చు.
కథ ఏమిటి?
రాజకీయ నాయకులు & వ్యాపారస్థులు టాక్స్ కట్టకుండా తమ పలుకబడి, తెలివితేటలు ఊపయోగించి ఎంతో కష్టపడి ధైర్యంతో సంపాదించుకున్న సొమ్మును మోసం చేసి, దేశంలో నిరుద్యోగులు దోచుకొవడం తప్పు కాదని చెప్పే ప్రయత్నం చేసినట్టు వున్నారు.
హైలట్స్ ఏమిటి? ఎవరెవరు బాగా చేసారు?
చెప్పుకొదగ్గ హైలట్స్ ఏమి లేవు. మొదట్లో కొద్దిగా కన్‌ఫ్యూజన్ అనిపించింది. స్లోగా కూడా వుందనిపించింది. రమ్యకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కీర్తి సురేష్ పర్వాలేదు. మిగతావాళ్ళు ఎవరనేది తెలియదు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.