పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ తర్వాత ప్రేక్షకుల్లో ఇంచుమించు అంతే నమ్మకం కలిగిన కాంబినేషన్ చరణ్-సుకుమార్. ఇంతకు ముందు ఈ కాంబినేషన్లో సినిమా రాకపొయినా, సుకుమార్ ఎదో కొత్తగా చూపిస్తాడనే ఆశ, రామ్‌చరణ్ ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు ఆశీంచే పెరఫార్మన్స్ ఇస్తాడని నమ్మకం.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం, ఈ నెల 24న సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా చెర్రీ కొత్త పోస్టర్‌ను ట్వీటర్‌లో వదిలారు. సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న రంగస్థలం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.