వెంకీ అట్లూరి

విలువైన సమయాన్ని వెచ్చించి అభిమానులు ఎంతో ఆశతో పబ్లిక్ ఫంక్షన్స్ కు వస్తారు. వాళ్ళు ఆశీంచే నాలుగు మాటలు మాట్లాడటం ఆ ఫంక్షన్ కు అతిధులుగా విచ్చేసిన వారి బాద్యత. ఏమి మాట్లాడాలో ప్రిపేర్ అయ్యి మైకు తీసుకొవాలి. వ‌రుణ్‌తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం 2018 ‘తొలిప్రేమ’ కు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది.

చాలా క్లారిటితో తనకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. స్పీచ్ కు ముందు ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళను మెగా అభిమానులు & పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైన్యం అంటూ సంబోధించడం బాగుంది. వాళ్ళకు కావాల్సిన మాటలతో స్టార్ట్ చెయ్యడంతో ఆ పంక్షన్ కు వచ్చిన అభిమానులు అందరూ కామ్ అయిపొయారు.

  1. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో న‌న్ను న‌మ్మిన వ్య‌క్తి… ఇండ‌స్ట్రీని న‌న్ను న‌మ్మేలా చేసిన వ్య‌క్తి దిల్‌రాజుగారు.
  2. నేను ఎక్క‌డో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న త‌రుణంలో ఆరు అడుగ‌ల నాలుగు అంగులాల ధైర్యాన్నిచ్చాడు వ‌రుణ్.
  3. నా న‌మ్మ‌కానికి ఊపిరి పోసిన వ్య‌క్తి బాపినీడు.
  4. మంచి సాంగ్స్ కోసం త‌మ‌న్‌ని, శ్రీమ‌ణిని ఇబ్బంది పెట్టాను.
  5. నేను క‌న్న క‌ల‌ను తెర‌పై అందంగా చూపించిన వ్య‌క్తి కెమెరా మెన్ జార్జ్ .
  6. నేను తీసిన సినిమాను అందంగా ఎడిట్ చేశారు ఎడిట‌ర్ న‌వీన్.
  7. ఇప్ప‌టి వ‌ర‌కు రాశిని గ్లామ‌ర్ క్వీన్‌గా చూసిన ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకునే రాశి ఖ‌న్నా క‌న‌ప‌డుతుంది.

bottomline:
పబ్లిక్ పంక్షన్స్ వచ్చే వాళ్ళు ఆశీంచే నాలుగు మటలు మాట్లాడేస్తే వాళ్ళు కామ్ అయిపొతారు. వాళ్ళను అవమానించాలనుకొవడం/రెచ్చగొట్టాలనుకొవడం తప్పు. ఈ ఆడియో ఫంక్షన్ లో వెంకీ అట్లూరి స్పీచ్ బెస్ట్ ఎక్సాంపుల్.

ముఖ్య అతిధులు కొద్దిగా ప్రిపేర్ అయ్యి మైకు తీసుకొవాలి.

 

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.