శ్రీ కత్తి మహేష్ చెడ్డోడు కాదు

సొషల్ మీడియాలో వైరల్ అయిన ఏ కంటెంట్ కైనా విమర్శలు వస్తాయి. బూతు కామెంట్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిరోను తిడితే, ఆ హిరో అభిమానులు వూరుకుంటారా? .. ఏ హిరో అభిమానులు వూరుకోరు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ చేస్తారు అనటం తప్పు.

పవన్ కల్యాణ్ ను వుద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడంలో తప్పు లేదు, కాని ఆ వ్యాఖ్యలపై వచ్చే కామెంట్స్ ఇగ్నోర్ చేస్తే సరిపొయేది. శ్రీ కత్తి మహేష్ ఫోన్ నెంబర్ సొషల్ మీడియాలో షేర్ చెయ్యడం తప్పు. ఆయన ఫోన్ నెంబర్ మార్చుకుంటే సరిపొయేది. మెయిన్ మీడియా హెల్ప్ చేసింది. పవన్ కల్యాణ్, తన ఫ్యాన్స్ ను కంట్రోల్ లో వుండమని చెప్పాడు. కనీసం అంతటితో ఆపేస్తే సరిపొయేది. తనను ఎక్కడా డైరక్ట్ రిఫర్ చెయ్యాపొయినా, పూనం కౌర్ పై డైరక్ట్ గా వ్యక్తిగత ప్రశ్నలు సంధించి మీడియా అగ్రహానికి గురయ్యాడు.

బెజవాడ డైరక్టర్ వివేక్ సంధించిన వ్యక్తిగత ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు వెళ్ళిపొయినా, పూనం కౌర్ విషయంలో తాను తప్పు చేసానని అంగీకరించక పొగా, పూనం కౌర్ కు మేలు జరుగుతుందని సమర్ధించుకున్నాడు.

శ్రీ కత్తి మహేష్ మీద కూడా మెయిన్ మీడియాలో లైవ్ షోస్ లో వ్యక్తిగత అసభ్యకరమైన వ్యాఖ్యలు మొదలవ్వడంతో పాటు, ఆధారాలు కూడా మీడియాకు అందించడం జరిగింది. వాటికి లొంగి తగ్గినట్టు కనిపించడం లేదు, కాని వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యనని అంటున్నాడు శ్రీ కత్తి మహేష్. తెరవెనుక ఏమి జరిగిందో జరిపించిన వాళ్ళకే తెలియాలి. శ్రీ కత్తి మహేష్ ఎపిసోడ్ ద్వారా పవన్ కల్యాణ్ కు లేనిపొనివి ఎన్నో అపాదించడంతో పాటు, త్రివిక్రమ్ ను ఒక బ్రోకర్ గా తెలుగు టి.వి ప్రేక్షకుల మనసుల్లో నాటాడు.  పవన్ కల్యాణ్ నుంచి పవన్ ఫ్యాన్స్ దాడి చేసారని క్షమాపణలు అడుగుతున్న శ్రీకత్తి మహేష్,  దానికంటే ముందు త్రివిక్రమ్ గారికి సారీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Kathi Mahesh
పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను.

bottomline:

  1. శ్రీ కత్తి మహేష్ చెడ్డోడు కాదు
  2. శ్రీ కత్తి మహేష్ అటెక్షన్ కోసం ఆరాటం తప్ప పవన్ కల్యాణ్ మీద ద్వేషంతో మొదలైంది కాదు. తాను విమర్శ అనుకుంటాడు, వినేవాళ్ళకు రెచ్చగొట్టినట్టు వుంటుంది. రాంగోపాలవర్మలా అభిమానుల రియాక్షన్ ను చూడకుండా ఈజీగా తీసుకుంటే సరిపోయేది.
  3. మీడియా Tv9 or ABN , శ్రీ కత్తి మహేష్ కు అనుకూలంగా ఏమి లేదు. చాలా మంచి ప్రశ్నలు సంధించారు .. పవన్ కల్యాణ్ దిగొచ్చేదాకా నేను తగ్గను అని బీష్మించుకొని కూర్చున్నాడు శ్రీ కత్తి మహేష్.
  4. తాను ఏ రకమైన రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేసాడో, అదే విధంగా తనపై వచ్చే రెచ్చగొట్టే విమర్శలను జీర్ణించుకొలేకపొతున్నాడు శ్రీ కత్తి మహేష్. దమ్ము & తెలివి విషయంలో రాంగోపాలవర్మ కంటే మించినోడు అయినా, సెల్ఫ్ కంట్రోల్ విషయంలో రాంగోపాలవర్మ దగ్గర నుండి ఈయన నేర్చుకొవాలి.
  5. శ్రీ కత్తి మహేష్ మంచి విమర్శకుడు. ముసుగులో గుద్దులేకుండా డైరక్ట్ గా ఎవరినైతే విమర్శించాలనుకుంటున్నాడో వాళ్ళని పేర్లు పెట్టి విమర్శించడం ఈయనకే చెల్లు. ఈ విషయంలో దమ్మున్నోడు.
  6. తప్పా ఒప్పా అని కాసేపు పక్కన పెడితే .. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన అభిప్రాయలను పదిమందికి చేరేలా చేయగల సమర్దుడు & తెలివైనోడు శ్రీ కత్తి మహేష్.
  7. శ్రీ కత్తి మహేష్ తన విమర్శలకు వచ్చే రియాక్షన్ పట్టించుకోకుండా ముందుకు సాగి వుండుంటే, రాజకీయాల్లో మంచి భవిష్యత్తు వుండేది.నేను ఎవరినైనా అంటాను. నన్ను ఎవరూ ఏమీ అనకూడదు అనడం కరెక్ట్ కాదు
  8. అత్యుత్సాహం, అల్లరితనం, ఆవేశం, తెలియనితనం, అమాయకం & నిస్సాహాయత తో వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళకు తెలియని పరిస్థితుల్లో చాలామంది జనాలు వున్నారు. ఒక్క పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే అనడం పెద్ద బూతు.  కచ్చితంగా వాళ్ళల్లో మార్పు రావాలి. కాని, వాళ్లని రెచ్చగొట్టడం/అవమానించడం ద్వారా మార్పు సాధించలేరు. 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం. Bookmark the permalink.