రామ్‌చరణ్-సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం రంగస్థలం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న రిలీజ్ అవుతుంది. సమంతా కధానాయిక. తర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, రావురమేష్, అనసూయ నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
మొన్న సంక్రాంతికి ఈ నెల 24న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు రీకన్ఫార్మ్ చేసారు. అజ్ఞాతవాసి సినిమాతో నీరసపడ్డ మెగా అభిమానుల్లో ఈ సినిమా టీజర్ కొద్దిగా ఉషారు తెస్తుందని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.