జై బాలయ్య!

నందమూరి ఫ్యాన్స్ & మెగాఫ్యాన్స్ మధ్య ఎన్నో ఎన్నెన్నో మాటల యుద్ధాలు జరుగుతూ వుంటాయి. వాళ్ళ సినిమా ఫ్లాప్ అయితే వీళ్ళు వెటకారం చెయ్యడం, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు వెటకారం చెయ్యడం సహజం. కొన్నిసార్లు హద్దులు దాటి హిరోలకు సంబంధించిన వ్యక్తిగత జీవితాలలోకి చొరబడి కామెంట్స్ చేస్తుంటారు, మాటల యుద్ధం కొట్లాట యుద్ధాలుగా మారిన సందర్భాలు కూడా వున్నాయి.

కాని, నిజ జీవితంలో నందమూరి హిరోలు ..మెగా హిరోలు .. ఒకరికొకరు ఎంతో గౌర్వాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. హిరోలు చెప్పినా అభిమానులు వినరు. పోటి వాతావరణం వుండాలనే వుద్దేశంతో హిరోలు అభిమానుల మధ్య జరిగే సరదాగా వెటకారం చేసుకునే యుద్ధాలకు స్పందించరు.

మెగా హిరోలకు పెద్ద చిరంజీవి అయితే, నందమూరి హిరోలకు పెద్ద బాలయ్య బాబు. కేవలం అభిమానులు చూస్తే సినిమాలు సూపర్ హిట్స్ అవ్వవు. సినిమా బాగుంటే ఏ హిరోను అయినా ఆదరించే సహృధయులు మన తెలుగు ప్రేక్షకులు. ఒరిజినల్ లాంగ్వేజ్ లో కంటే మన తెలుగులో బాగా ఆడిన డబ్బింగ్ సినిమాలే మంచి ఉదాహరణ.

అందరి హిరోల అబిమానులను ఆకట్టుకొవాలంటే పెద్దలను గౌరవించాలి. ఇప్పుడు జరిగింది అదే. బాలయ్య బాబుకు సాయి ధర్మ్ తేజ్ ఇచ్చే గౌరవమే, బాలయ్య బాబు చేత టీజర్ రిలీజ్ చేయించుకొవడం. బాలయ్య అంగీకరించడం బాలయ్య బాబు వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పే ఒక సంఘుటన.

తనను అగౌరవ పరిచినా, ఇబ్బంది పెట్టినా చుక్కలు చూపించే బాలయ్య బాబు, తనను గౌరవించే వాళ్ళకు ఎంతటి ప్రేమను పంచుతాడో ఈ టీజర్ రిలీజ్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. బాలయ్య బాబు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, బాలయ్య బాబులా బ్రతకాలంటే ఒక్క బాలయ్య బాబుకే సాధ్యం అన్నది నిజం. ఎటువంటి కల్మషం లేని ఏకైక టాలీవుడ్ హిరో నందమూరి బాలకృష్ణ. అందుకే జై బాలయ్య!

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.