భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారతీయులందరికీ వాక్ స్వాతంత్య్రం వుంది. అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకొవచ్చు. మీడియా వుంటే, ప్రజల మీద రుద్దేయవచ్చు.
మీడియా నిజం అన్నట్టుగా ప్రచారం చేసే వాళ్ళ అభిప్రాయాలను ఈజీగా తీసుకోగలిగే శక్తి రాజకీయ పార్టీలకు ఎంతో అవసరం. మీడియాను నిందించడం తప్పు. ఎందుకంటే వారి మనుగడ కోసం ఏదొక రాజకీయపార్టీకి సపొర్ట్ చెయ్యాలి. ఆ పార్టీకి అనుగుణంగా పనిచెయ్యాలి.
ఆంధ్రజ్యోతి మీడియా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా పనిచేసే మీడియా అని జగమెరిగిన సత్యం. పవన్ కల్యాణ్ తెలుగుదేశానికి సపోర్ట్ కాబట్టి, పవన్ కల్యాణ్ పై కావాలని విషం జల్లే ప్రయత్నం చెయ్యదు. విషం జల్లకపొయినా, తెలుగుదేశం కంట్రోల్ లో వుంచుకొవడానికి బురద జల్లే అవకాశం వుంది.
బురద జల్లడం అంటే చిన్న చిన్న తప్పిదాలను కూడా భూతద్దంలో పెద్దవిగా చూపించడం. గతంలో చేయలేని పనులను ఎందుకో చేయలేదో వివరణ ఇచ్చినా, ఆ వివరణను ఇగ్నోర్ చేస్తూ, ఆ పనులెదో తప్పన్నట్టు చూపించడం.
జనసేనను సపొర్ట్ చేసే వాళ్ళ ఉత్సాహన్ని చంపేసే ప్రయత్నంలో కొత్త రాజకీయ పార్టీలపై వచ్చే విమర్శలే ఇవి. ఈ విమర్శలను ఆపే శక్తి జనసేనకు లేకపొయినా, బలంగా నిలబడవలసిన అవసరం జనసేనపై వుంది. ఎవేవో కారణాలు చూపించి “Pawan Kalyan is not suitable for politics” అని పవన్ కల్యాణ్ ను వెనక్కు లాగాలని ప్రయత్నం చేస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అభిప్రాయాన్ని తప్పు పట్టలేము.