వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‘. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది.
టీజర్ బాలయ్యబాబు చేతుల మీదుగా, ఫస్ట్ పాట ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేసి అందరి దృష్టి ఈ సినిమాపైకి వచ్చేలా చెయ్యడంలో దర్శకనిర్మాతలు సక్సస్ అయ్యారు.
వినాయక్ తరహా మాస్ సినిమా. ఇప్పటివరకు మొత్తం నాలుగు పాటలు రిలీజ్ చేసారు. అందులో ఒక పాట చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ “చమక్ చమక్” సాంగ్. మాస్ ను అలరిస్తున్నాయి. ఈ రోజు రిలీజ్ చేసిన కళా కళా కళామందిర్ సాంగ్ కూడా, థమన్ పాత సాంగ్స్ ను గుర్తుకు తెచ్చెలా వున్నా, మాస్ ను అలరించే ఇనిస్టెంట్ హిట్ అని చెప్పవచ్చు. సాయి ధర్మ్ తేజ్ తన డాన్స్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళాలా వుంది.