ఛలో సినిమా చూడొచ్చా?
మనం సినిమా నుంచి ఏమి ఎక్సపెట్ చేస్తామో, అవి ఆ సినిమాలో వుంటే ఆ సినిమాను కచ్చితంగా చూడొచ్చు అనుకుంటాం. ఎక్సపెటేషన్స్ కీలకం.
ఎక్కువ లాజిక్స్ ఆలోచించకుండా సరదా కోసం సిరియస్ గా అల్లుకున్న ఒక కథలో ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంటర్‌టైన్‌మెంట్ పొందాలనుకుంటే ఒక్కసారి కచ్చితంగా థియేటర్ లో చూడొచ్చు.
కథ ఏమిటి?
గొడవలని చేసే/చూసి ఆనందించే వాడిని గొడవల మధ్య వదిలితే వాడిలో వచ్చిన మార్పే ఈ కథ.
నాగ శౌర్య ఎలా వున్నాడు? ఎలా చేసాడు??
బాగున్నాడు. యువ కథా నాయకులంతా ఫిట్‌నెస్ తో స్క్రీన్ మీద అల్లాడిస్తుంటే, నాగశౌర్య మాత్రం ఫిట్‌నెస్ అసలు కేర్ తీసుకున్నట్టు లేదు.
బాగా చేసాడు.
ఇంకా ఎవరు బాగా చేసారు??
అందరూ బాగా చేసారు.
సత్య హైలట్. సునీల్ లా అనిపించాడు.
హిరోయిన్ బాగానే వుంది.
వెన్నెల కిషోర్ మరో హైలట్
మ్యూజిక్ ఎలా వుంది?
హైలట్. సినిమాను బాగా అంటే బాగాఎలివేట్ చేసి, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. పాటలు బాగున్నాయి.
డైరక్షన్ ఎలా వుంది?
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్ లో కథంతా నడిపించడం మాములు విషయం కాదు. వెల్ డన్. డైలాగ్స్ కేక.