దిల్ రాజు vs వి.వి. వినాయక్

సాయి ధర్మ్ తేజ్ “ఇంటిలిజెంట్” ఫిబ్రవరి 9న, వరుణ్ తేజ్ “తొలిప్రేమ” ఫిబ్రవరి 10న .. ఒక రోజు గ్యాప్ రిలీజ్ అవబోతున్నాయి.

రెండు మెగా సినిమాల మధ్య మినిమమ్ 1 నెల గ్యాప్ వుంచవలసిన బాద్యత మెగా హిరోలపై వుంది.  ఏప్రిల్ నెలను బన్నీ లాక్ చేసుకున్నాడు. రామ్‌చరణ్ సంక్రాంతి లాక్ చేసుకుంటే, పవన్ కల్యాణ్ కబ్జా చేసేసాడు. పాపం రామ్‌చరణ్ కు వేరే ఛాయిస్ లేక మార్చి నెలలో వస్తున్నాడు.

సాయి ధర్మ్ తేజ్ & వరుణ్ తేజ్ లు ఫిబ్రవరి 14 దగ్గర్లో ఫిక్స్ చేసుకొని వస్తున్నారు.

ఈరోజుల్లో సినిమా అంటే పబ్లిసిటీ .. ప్రి రిలీజ్ ఎంత హైప్ చేయగల్గాము అనే దాని మీదే సినిమా ఓపినింగ్స్ ఆధారపడి వుంది. సాయి ధర్మ్ తేజ్ & వరుణ్ తేజ్ లు హిరోలు అయినా, పబ్లిసిటి ప్లానింగ్ లో దిల్ రాజు vs వి.వి. వినాయక్ పొటీ పడుతున్నారు.

ఫిదా సినిమా క్రియేట్ చేసిన సన్సేషన్ వలన ఆటోమేటిక్ గా “తొలిప్రేమ” సినిమా మీద యూత్ లో మంచి క్రేజ్ వుంది.  దిల్ రాజు ఈ సినిమా నిర్మాత కాకపొయినా, సినిమా మొత్తం కొనేసుకొని తానే రిలీజ్ చేసుకొని, పబ్లిసిటీ ప్లానింగ్ బాద్యత కూడా తానే తీసుకున్నాడు.

సాయి ధర్మ్ తేజ్ కు మాస్ లో వున్న క్రేజ్ ను బేస్ చేసుకొని, వినాయక్ ఒక వ్యూహం ప్రకారం మంచి హైప్ క్రియేట్ చేసాడు.

ఇక ప్రేక్షక దేవుళ్ళ తీర్పే మిగిలివుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.