చిట్టిబాబుకి 10 మిలియన్ యూట్యూబ్ వ్యూస్

ధృవ సినిమాలో అరవింద్ స్వామికి ధీటుగా నిలబడి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రామ్‌చరణ్ & సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టీజర్, తాజాగా 10 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది.

రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే చెవిటి వాడి పాత్రలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. 1985 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఓ పెద్ద ప్రయోగం అని చెప్పవచ్చు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.