వినాయక్ ను తక్కువ అంచనా వేస్తున్న వెబ్ ప్రపంచం

“పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రమణ్యం ఫర్ సేల్” & “సుప్రీమ్” సినిమాల ద్వారా సాయి ధర్మ్ తేజ్ మాస్ ప్రేక్షకుల్లో మంచి స్టార్డం సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్డం తెచ్చిపెట్టే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. “విన్నర్”, “తిక్క” & “జవాన్” సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యాయి.

మేనమమల పోలికలకు తోడు, సాయి ధర్మ్ తేజ్ తో పనిచేసే దర్శకులు మెగాబ్రదర్స్ అభిమానంతోనో మెగా అభిమానులను ఆకట్టుకుందామనో వాళ్ళ సినిమాలో సాంగ్స్ & బిట్స్ సాయి ధర్మ్ తేజ్ చేత చేయిస్తూ వుంటారు.  దర్శకుల నమ్మకాన్ని కాదనే కాన్ఫిడెన్స్ సాయి ధర్మ్ తేజ్ కు ఇంకా రాలేదు. 

మెగా అభిమానులు సాయి ధర్మ్ తేజ్ ను అర్దం చేసుకొవడం లేదు. అపార్దం చేసుకుంటున్నారు. మెగా అభిమానులు లేనిపోని విమర్శలు చేస్తున్నారు.

ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న సాయి ధర్మ్ తేజ్ “ఇంటిలిజెంట్” సినిమాకు దర్శకుడు వి.వి.వినాయక్‌.  రిస్క్ తీసుకొవడానికి అసలు ఇష్టపడని దర్శకుడు.   వినాయక్ తీసే ఫార్ములా సినిమాలు, చాలా మంది కొత్త దర్శకులు కొద్దిగా స్పైస్ యాడ్ చేసి ఇంకా బాగా తీస్తున్నారు. వినాయక్ దగ్గర జ్యూస్ అయిపొయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఇక వెబ్ ప్రపంచంలో అయితే చెప్పక్కర్లేదు.  “ఇంటిలిజెంట్” ట్రైలర్ & పాటలు  మాస్ ను అలరించే విధంగా వున్నా కూడా, వివిధ రకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

bottomline:

వినాయక్ & సాయి ధర్మ్ తేజ్ లపై వెబ్ ప్రపంచంలో వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్స్ కు “ఇంటిలిజెంట్” సినిమా కమర్షియల్ సక్సస్సే   సమాధానం చెప్పగలదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అభిప్రాయం, Featured. Bookmark the permalink.