చిట్టిబాబుని రామలక్ష్మి డామినేట్ చేసేసింది

రామ్‌చరణ్‌ ‘చిట్టిబాబు’గా సమంత ‘రామలక్ష్మి’గా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎనౌన్స్ చేసినట్టుగానే టైంకి ఈ సినిమాలోని మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అంటూ మొదలైన ఈ పాట వినంగానే ఆకట్టుకునే విధంగా వుంది. ఈ పాటలో చిట్టిబాబుని రామలక్ష్మి పూర్తిగా డామినేట్ చేసేసింది. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాదే ఈ పాట పాడటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.