‘ఛల్ మోహన్ రంగ’ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్, త్రివిక్రమ్ కథ & నితిన్ హిరో .. కాంబినేషన్ సినిమా మొదలైనపుడు సూపర్ అనిపించింది కాని, అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యాక్ కొద్దిగా డౌన్ అయ్యింది. టీజర్ వచ్చాక మళ్ళీ పుంజుకుంది.
ఇప్పుడు రిలీజ్ అయిన పాటతో మరికొన్ని మార్కులు సంపాదించుకొని ముందుకు సాగుతుంది. సంగీత దర్శకుడు థమన్ ఫ్రెష్ ట్యూన్ ఇచ్చాడు. ఈ ఏడాది థమన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే ‘భాగమతి, తొలిప్రేమ’ వంటి చిత్రాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం ఆకట్టుకొవడంతో పాటు ఆ సినిమాల సక్సస్ లో ప్రధాన పాత్ర పోషించాడు.
ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఛల్ మోహన్ రంగ’ సూపర్ హిట్ అయ్యి పవన్ కల్యాణ్ కు డబ్బులు తీసుకు రావాలి.