రంగస్థలం సినిమా కోసం ఏడాది పాటు కష్టపడ్డాను. ఏడాది పాటు గుబురు గెబ్బం… మీసం తోనే ఉన్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా నాకొక కొత్త అనుభూతినిచ్చింది. నా గత సినిమాలు మిస్ అయినా…ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరూ చూడండి. అందరికీ కచ్ఛితంగా నచ్చుతుంది
–రామ్ చరణ్
- మొదటి సినిమా “చిరుత” తోనే మెగాఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయిపొయాడు రామ్‌చరణ్. కమర్షియల్ గా హిట్ అనిపించుకున్నా, ఓవరాల్ గా ఎవరేజ్ అనిపించుకుంది.
- రెండో సినిమా “మగధీర” ఇండస్ట్రీ హిట్. కమర్షియల్ స్టామినా ఇంతుందా అని ఆశ్చర్యపరిచాడు. కేవలం మాస్ కే పరిమితం అయి, వల్గారిటీ దర్శకుడిగా పేరున్న రాజమౌళికి మెగాఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా చేసాడు రామ్‌చరణ్.
- చిరంజీవి కొడుకు అనే ఇమేజ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో తన సొంత నిర్ణయంతో “ఆరెంజ్” అనే తప్పటడుగు వేసి, కాస్టిలీ మిస్టెక్ చేసాడు.
- సబ్జక్ట్స్ విషయంలో చిరంజీవి సహాయంతో “రచ్చ“, “నాయక్” & “ఎవడు” సినిమాల ద్వారా మాస్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఆ సినిమాలు ఇప్పటి ట్రెండ్ దూరంగా వుండటంతో క్లాస్ ప్రేక్షకులకు దూరం అయ్యాడు.
- తనతో సినిమా చెయ్యడానికి వచ్చారనే గౌరవంతో, పూర్తిగా దర్శకుల నిర్ణయాలకు వదిలేసి చేసిన “గోవిందుడు అందరివాడేలే” & “బ్రూస్‌లీ” సినిమాలు అనుకున్నంతగా సంతృప్తి ఇవ్వలేదు & కమర్షియల్ గా క్రిందకు తోసేసాయి.
- మధ్యలో ఒక హిందీ సినిమా ప్రయత్నం చేసి టైం వేస్ట్ చేసుకొని అవమానాలకు కూడా గురి కావాల్సి వచ్చింది.
- ఈ నేపధ్యంలో ఎన్నో విమర్శలు మధ్య “ధృవ” చేసి, అరవింద్ స్వామికి ధీటుగా తనను తాను నిరూపించుకొని అభిమానుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా బాగానే బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఇప్పుడు దర్శకుడు సుకుమార్ మీద నమ్మకంతో అందరికీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసానంటున్నాడు రామ్ చరణ్. ఈ ప్రయత్నంలో రామ్ చరణ్ ఎంతవరకు సక్సస్ సాధిస్తాడో తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.