చిరంజీవికి స్వయంకృషి .. చరణ్ కు రంగస్థలం.
—సమంతా
రంగస్థలం. రంగస్థలం. మెగా అభిమానులు ఎంతో టెన్షన్‌తో ఎదురుచూస్తున్న సినిమా. ఒకపక్క చరణ్ పెరఫార్మన్స్ ఎలా చేస్తాడని, మరోపక్క ఎంత కమర్షియల్ సక్సస్ సాధిస్తుందోనని.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో సమంతా మాట్లాడుతూ “చిరంజీవికి స్వయంకృషి .. చరణ్ కు రంగస్థలం” అని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆ మాటలు నిర్మాత “నవీన్ ఎర్నేని” కు నచ్చలేదు, బహుశా కమర్షియల్ గా జనాలు అపార్దం చేసుకుంటారెమోనని భయపడ్డాడు అనుకుంట. “చిరంజీవికి ఖైదీ .. చరణ్ కు రంగస్థలం” అని అన్నాడు.
మెగా అభిమానులు తొడలు కొట్టేవిధంగా చరణ్ పెరఫార్మన్స్ తో పాటు, భారీ కమర్షియల్ విజయం సాధిస్తుందా అనేది తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.