2019లో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాది

చంద్రబాబుని తక్కువ చెయ్యడానికి చంద్రబాబు C/O వెన్నుపోటు అని అంటూ వుంటారు. అధికారం చేతిలోకి వచ్చాక అటువంటి దెబ్బుపొడుపు మాటలు పెద్దగా పట్టించుకొవాల్సిన అవసరం లేదు అన్నది చంద్రబాబు క్యారెక్టర్.

రాష్ట్ర విభజనకు మూల కారణం వైయస్సార్ & చంద్రబాబు. అధికారం కోసం వైయస్సార్ నిప్పు అంటిస్తే, చంద్రబాబు పెట్రోలు పోసి రాష్ట్రం విడిపొవడానికి కారకులు అయ్యారు. మొత్తం తప్పంతా కాంగ్రెస్ మీద నెట్టేసి, చంద్రబాబు & వైయస్సార్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం & ప్రధాన ప్రతి పక్షాలుగా మిగిలాయి.

తెలుగువాళ్ళు రెండు రాష్ట్రాలుగా విడిపొయారు. దీని వలన లాభాలే కాని, అసలు నష్టాలు లేవు అన్నది నిజం. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా వుంది. రాజధానిని నిర్మించుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తిరుగులేని రాష్ట్రంగా నిలబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ కు రాజధానితో పాటు ఒక రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయలు కలిపించ వలసిన బాద్యత కేంద్రంపై వుంది. సమకూరుస్తామని ప్రామిస్ చేసారు.

బిజెపి & తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతాది అని అందరూ భావించారు. పవన్ కల్యాణ్ కూడా అదే బలంగా నమ్మాడు. తాను ఏమి చేయగలడో అది చేసాడు.

తెలుగుదేశం & బిజెపి పార్టీలు నాలుగేళ్ళు కలిసి వున్నారు. స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. నాలుగేళ్ళు ప్రజలను మభ్యపెట్టారు. నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు, అసలు ఏమి ఇవ్వలేదని తెలుగుదేశం మొత్తం తప్పంతా బిజెపి మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తుంది.

ఏమీ ఇవ్వక పొవడంలో కేంద్రం తప్పు ఎంత వుందో, గత నాలుగేళ్ళు ఆ నిజాన్ని ప్రజలకు తెలియనీయక పొవడంలో తెలుగుదేశం తప్పు కూడా అంతే వుందని తెలుగుదేశాన్ని ఎవరైనా విమర్శిస్తే తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకొవడం లేదు సరికదా, తెలుగుదేశాన్ని ప్రశ్నించిన వాళ్ళపై తమదైన రీతిలో విరుచుకుపడుతున్నారు.

తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపొవడంలో తప్పు లేదు. గత నాలుగేళ్ళల్లో తెలుగుదేశాన్ని నమ్ముకున్న ప్రతివోడు ఆర్ధికంగా ఎంతో బలపడ్డారు. మీడియా మొత్తం తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోనే వుంది. 2019లో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాది అనే ధీమాకు వచ్చేసారు.

తెలుగుదేశం బలాలు:
1) అధికారం
2) డబ్బు
3) మీడియా
4) పార్టీ కోసం పార్టీ వ్యవస్థాపకుడి పైన కూడా జాలి చూపని కార్యకర్తలు(రాజకీయల్లో ఇది ముఖ్యం)

వైయస్సార్‌సిపి:
1) కులం
2) వైయస్సార్ సానుభూతిపరులు
3) డబ్బు

జనసేన:
1) కులం
2) కులాలకు ఆతీతంగా పవన్ కు వున్న అభిమానులు

2019లో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాది & 2019లో దేశ ప్రధానిని నిర్ణయించబోయేది కూడా చంద్రబాబే. 👌

bottomline:
అవసరమైతే ఎవరి కాళ్ళైన పట్టుకోగలడు, ఎదురు తిరిగితే ఎవరి తలైన నరకగలడు చంద్రబాబు.(రాజకీయంగా)

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, Politics. Bookmark the permalink.