సినిమా ఎలా వుంది?
చాలా చాలా అరుదైన సినిమా. సినిమా సృష్టికర్త సుకుమార్ కు 100% మార్కులు.
సినిమా చూడోచ్చా??
ఏ సినిమా నైనా చూడొచ్చా అని ఎవరైనా అడిగితే “చూడొచ్చు” “స్కిప్ చెయ్యొచ్చు” అని ఒక ముక్కలో వేవ్ లెంగ్త్ కలిసే వాళ్ళకు చెప్పొచ్చు కాని, అందరికీ చెప్పడం కష్టం. కండిషన్స్ వుంటాయి. ఈ సినిమాకు చాలా వున్నాయి. 1) మోటైన సినిమా 2) ప్రేమ కథా చిత్రం కాదు and so on. ఈ సినిమాకు పనిచేసినోళ్ళందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఒక్క సీను కూడా వేస్ట్ అనిపించలేదు. ఎబ్బెట్టు అనిపించలేదు.
ఎంటర్ టైన్ మెంట్ వుందా??
హిరోకు వినికిడి లోపం. ఈ లోపంతోనే ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే, అన్ని ఎమోషన్స్ పండించాడు సుకుమార్. రామ్‌చరణ్ సుకుమార్ ఆశీంచిన దానికి కంటే వంద రెట్లు ఎమోషన్స్ ఇవ్వడం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పుకొవచ్చు.
రామ్‌చరణ్ తో పాటు ఇంకా ఎవరు బాగా చేసారు?
ఈ సినిమాకు పనిచేసినోళ్ళందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇది కచ్చితంగా దర్శకుడి గొప్పతనమే. సమంతా బాగా చెయ్యడమే కాదు, పల్లెటూరి గ్లామర్ రోల్ ఆకట్టుకుంది. చరణ్ & అనసూయ హైలట్. ఆది పినిశెట్టి ఒదిగిపొయాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ , జబ్బర్దస్త్ మహేష్ and so on .. అన్నీ గుర్తుండి పొయే క్యారెక్టర్సే.
అందరూ బాగా చేస్తే రామ్‌చరణ్ ప్రత్యేకత ఏమిటి?
హిరో కోణంలో జరిగే కథ. హిరోలా వుండడు. రంగస్థలంలో ఒక క్యారెక్టర్ గా వుంటాడు. అదే ప్రత్యేకత.
హైలట్స్ ఏమిటి?
మెగాఫ్యాన్స్, సుకుమార్ ఫ్యాన్స్ & ఈ సినిమా నచ్చిన వాళ్ళు సినిమాలో క్యారెక్టర్స్ నుంచి బయటకు రావడానికి ఒక వారం రోజులు పడతాది.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా వుంది?
ఎన్నికలపుడు వచ్చే సాంగ్ లోనే అతని వాయిస్ పంటి క్రింగ రాయిలా అనిపించింది. సినిమాకు ప్రాణం పొసాడంటే అతిశయోక్తి కాదు.
నిర్మాతల పరిస్థితి?
ఏ నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీసారో తెలియదు కాని, సుకుమార్ వాళ్ళ కాళ్ళకు మొక్కుచ్చు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోసం ఆరాటపడుతున్న సమయం కావడం వలన సేఫ్ అయ్యారు. కేవలం ప్రశంసలకే పరిమితం కావల్సిన సినిమా, రామ్‌చరణ్ కెరీర్ లో నెం 1 కమర్షియల్ సినిమా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సుకుమార్ కి ఎక్కువ పేరు వస్తుందా? రామ్‌చరణ్ కు ఎక్కువ పేరు వస్తుందా?
అర్జున్ రెడ్డి & రంగస్థలం .. దర్శకుల కష్టం, విజన్ & నమ్మకం.
రెండు సినిమాల్లో హిరోలిద్దరూ, వేరే హిరోలను ఊహించుకొలేని విధంగా జీవించి, ప్రేక్షకులను మైమరిపించారు.
లెంగ్త్ ఎక్కువ అనిపించలేదా?
yes, లెంగ్త్ ఎక్కువ అనిపించింది. but, క్లైమాక్స్ చూసాకా, ఇంకా వుంటే బాగుండేది అప్పుడే అయిపొయిందా అని కూడా అనిపించింది.