మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రంగస్థలం’ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు ఆర్జించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది.
“రామ్‌చరణ్ తన మొదటి సినిమా “చిరుత” తోనే మెగా అభిమానులకు కనెక్ట్ అయిపొయాడు. సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు కూడా కనెక్ట్ అయ్యాడు. రెండో సినిమా “మగధీర” ద్వారా తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో కూడా చూపించాడు” అని మెగా అభిమానులు అనుకుంటూ వుంటారు. కాని, మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఎవేవో వంకలు పెడతారు. మగధీర సినిమా మొత్తం రాజమౌళి ఎకౌంట్‌లో వేసేస్తారు.
మగధీర సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా కమర్షియల్ గా ఘోరంగా ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత సేఫ్ సైడ్, చరణ్ అన్నీ మాస్ సినిమాలే చెయ్యడం, రాజమౌళి మగధీర మించి బాహుబలి తీయడం, మరో పక్క ఎప్పుడు చూసినా మెగా అభిమానులకు క్లాసులు పీకడం మొదలుపెట్టిన అల్లు అర్జున్, రేసుగుర్రం సినిమాతో చరణ్‌ను దాటేసాననుకొని కాలర్ ఎగరేయడం.. మెగాభిమానుల పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి క్లిష్ట సమయంలో రంగస్థలం సినిమా రావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.
రంగస్థలం ముందు వచ్చిన ధృవ కమర్షియల్ హిట్ అనిపించుకున్నా, అక్కడక్కడా ఎవో విమర్శలు & వంకలు వినిపిస్తూనే వున్నాయి. రంగస్థలం తో మాత్రం, ఏకగ్రీవంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
‘యంగ్‌టైగర్’ ఎన్టీఆర్ కూడా పబ్లిక్ గా ప్రశంసలు తెలియజేయడం, నిజంగా అభినందనీయం. Thank You jrNTR.
‘ఇప్పుడే ‘రంగస్థలం’ చూశాను. హ్యాట్సాఫ్ చరణ్. ప్రస్తుతం నువ్వు అందుకుంటున్న ప్రశంసలకు అర్హుడివి. నా నుంచి కూడా ఒకటి అందుకో. మరెవరూ ఇంతకంటే బాగా చేయలేరు. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపిన సుకుమార్‌కు అభినందనలు. అప్పటికాలానికి తగినట్లు ఓ భావోద్వేగ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ధైర్యానికి అభినందనలు. సమంత, దేవిశ్రీప్రసాద్, మైత్రి మూవీస్, ‘రంగస్థలం’ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మీ సమర్థత కారణంగానే చిత్రం ఈ స్థాయిలో ఉంది. మీరంతా అత్యద్భుతంగా పనిచేశారు.’ అంటూ కమర్షియల్ ట్వీట్ చేశారు.
nice of jrNTR. కొన్ని విషయాల్లో ప్రేమ పైకి చెప్పనవసరం లేదు. నిజానికి రంగస్థలం విషయంలో కూడా చరణ్ కు ఫోన్ చేసి చెపితే చాలు. పబ్లిక్ గా ఇలా చెప్పడం వలన సినిమా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ వుంది. ఈ సినిమాకు ఆ అవసరం వుందని అనుకొనుండచ్చు. It is Really nice of jrNTR.
Thank You jrNTR.
bottomline:
ధృవ సినిమాలో అరవింద్ స్వామికి ధీటుగా నిలబడి పెరఫార్మ్ చేసాడు. రాజమౌళి సినిమాలో ఎన్.టి.ఆర్ కి కూడా ధీటుగా నిలబడి పెరఫార్మ్ చేయగలనని “రంగస్థలం” సినిమాతో చరణ్ ప్రూవ్ చేసుకున్నాడు.