Thank you మహేష్ బాబు & రాజమౌళి

అన్ని తెలుగు ప్రేక్షక వర్గాలు సినిమా కోసం ఎదురుచూసే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ అని రాజమౌళి నిరూపించుకున్నాడు.

మొన్న jrNTR రంగస్థలం సినిమాపై పబ్లిక్ గా స్పందించడం, ఇప్పుడు మహేష్ బాబు & రాజమౌళి స్పందించడం టాలీవుడ్ కి చాలా మంచి రోజులు వచ్చినట్టే అనుకొవచ్చు.

అటు మేకింగ్ లో & ఇటు జనాలను ఆకర్షించడంలో రంగస్థలం సినిమా బాహుబలి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు. సుకుమార్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు అర్దం కాదు, కనెక్ట్ అవ్వలేరు అనే విమర్శ వుంది. రంగస్థలం సినిమా మాత్రం మాస్ కు బీభత్సంగా కనెక్ట్ అయిపోయింది. దాని ప్రభావమే ఈ భారీ కలక్షన్స్.

ఈ సినిమాలో లోపాలు అనలేము కాని, 1) కిడ్స్ కనెక్ట్ అయ్యే thread లేకపొవడం 2) ఓవర్ మోటుతనం .. ఈ రెండు విషయాల వలన కొంతమంది ప్రేక్షకుల్లో అసంతృప్తి వుంది. స్లోగా అవి కూడా తొలిగిపొయి, తెలుగు ప్రేక్షకులు అందరికీ “రంగస్థలం” ఫేవరెట్ మూవీ అయ్యే అవకాశాలు వున్నాయి.

‘‘రంగస్థలం’ సినిమాలో అనేక గొప్ప విషయాలు ఉన్నాయి. కానీ సుకుమార్‌ ‘చిట్టిబాబు’ పాత్రని మలిచిన విధానం, అందులో చరణ్‌ నటించిన తీరు.. వారి ప్రతిభను అందరికీ తెలియజేశాయి. అతడి పాత్రలోని ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ అద్భుతం.. నెమ్మదిగా డైలాగ్స్‌ పలుకుతూ నటించిన జగపతిబాబు సూపర్‌. బాక్సాఫీసు వద్ద విశేషంగా రాణిస్తున్నందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు, సుక్కుకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

‘సుకుమార్‌ మీరు నిజంగా మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్‌. దేవిశ్రీ ప్రసాద్‌ రాక్‌స్టార్‌. రత్నవేలు ఎప్పుడూ తెలివిగా పనిచేస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతలు మరోసారి చక్కటి చిత్రం తీశారు. రామ్‌చరణ్‌, సమంత.. ఇది మీ సినీ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రం. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమాను పూర్తిగా ఎంజాయ్‌ చేశా’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

Thank you మహేష్ బాబు & రాజమౌళి

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.