పార్టీని నిలబెట్టుకొవడం కోసం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి.ఆర్ మీదే చెప్పులు విసిరిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. పవన్ కల్యాణ్ ఆ పార్టీని & ఆ పార్టీ వారసుడిని విమర్శిస్తే చేతులు ముడుచుకొని కూర్చుంటారా?
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన మీద కామెంట్స్ తో అసభ్యంగా దాడి చేస్తున్నారనే నెపంతో పవన్ కల్యాణ్ పూనం కౌర్ ను త్రివిక్రం సహాయంతో మోసం చేసాడని, దానికి తన దగ్గర బలమైన సాక్ష్యాలు వున్నాయని, శ్రీ కత్తి మహేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్ గా పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసాడు.
అప్పటి నుండి పవన్ కల్యణ్ – పూనం కౌర్ ల మధ్య సంబంధంపై ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వూహించుకుంటున్నారు.
అసలు నిజం ఏమిటి? ఈ నిజాన్ని బయట పెట్టడం ద్వారా రాజకీయంగా పవన్ కల్యాణ్ పార్టీని చంపేయవచ్చా? అని ఎన్.టి.ఆర్ మీద చెప్పులు వెయ్యడాన్ని కూడా సమర్ధించిన తెలుగుదేశం కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.అందులో భాగంగా తెలుగుదేశం మీడియాగా పేరొందిన ABN ఛానల్ లో పూనం కౌర్ ఇంటర్వ్యూ ఒకటి ప్రసారం చేసారు. ఇది కేవలం పవన్ కల్యాణ్ కు వార్నింగ్ మాత్రమేనని, పవన్ కల్యాణ్ వాయిస్ పెంచిన రోజు పూనం కౌర్ చేత అసలు నిజం చెప్పించి, పవన్ కల్యాణ్ పరువు తీసి ప్రజల్లో విలువ లేకుండా చేసే విధంగా, తమ పార్టీ నాయకులు వ్యూహం చేసారని తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటున్నారు.
bottomline:
తెలుగుదేశంతో పెట్టుకుంటే వూరుకుంటారా?