రాజమౌళితో సినిమా చేస్తే హిరో రేంజ్ పెరుగుతుందనే మాట వాస్తవం. రేంజ్ పెరగడంతో పాటు ఆ హిరోపై ఒత్తిడి పెరుగుతుందనే విషయం మరిచిపొకూడదు.
మగధీర సినిమా తో రామ్‌చరణ్ స్టామినా ఇంతుందా అనే ఆశ్చర్యంతో రాజమౌళీ రేంజ్ కూడా అమాంతంగా పెరిగిపొయింది. ఆ రేంజ్ కు తగ్గట్టు గానే బాహుబలితో జాతీయ స్థాయికి రీచ్ అయిపొయాడు. ఇప్పుడు రాజమౌళి ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్.
రామ్‌చరణ్ “రంగస్థలం” జాతీయ స్థాయిలో రిలీజ్ చేయలేకపొయారు కాని, తెలుగులో బాహుబలి తర్వాత సినిమాగా నిలిచింది. అదే స్థాయిలో రామ్‌చరణ్ కు పేరు తీసుకొచ్చింది.
రాజమౌళికి మగధీర ఇచ్చిన రామ్‌చరణ్ , సుకుమార్ కు రంగస్థలం ఇచ్చాడు. సుకుమార్ కరెక్ట్ గా ప్లాన్ చేయగల్గితే నెక్స్ట్ మహేష్ బాబు మూవీని జాతీయ స్థాయిలో బాహుబలిని మించిన కమర్షియల్ సినిమా తీయగలడు.
రామ్‌చరణ్ తో సినిమాలు చేసి దర్శకులు తమ రేంజ్ పెంచుకున్నారు సరే, రామ్‌చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఎంటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. సినిమా రిలీజ్ అయితే కాని తెలియదు. ఇంకా పేరు ఎనౌన్స్ చెయ్యని ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణి కథానాయిక. దానయ్య.డి.వి.వి నిర్మాత. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో కుటుంబ నేపథ్యంలో సాగే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు.
ఈ నెల 12 నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరగనుంది. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, ఛాయాగ్రహణం: రిషి పంజాబి, సంగీతం: దేవిశ్రీప్రసాద్. 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
రామ్ చరణ్ సినిమాకి వెన్నుపోటు పొడుస్తుంది ఎవరు..?
బోయపాటి (Boyapati) దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు, ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారు అంటే దాని గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేదు, అయితే ఈ సినిమా గురించి రోజు ఎదో ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంది, తాజాగా ఈ సినిమా పై మరో వార్త నేట్టింట్లో హల్చల్ చేస్తుంది.
click hre for more updates:http://bit.ly/2q67l4q