ఇరగదీసిన పవన్‌కల్యాణ్

pawan1

కాంగ్రెస్ నాయకుల గురించి పవన్‌కల్యాణ్ మాటల్లో

దానం నాగేందర్: ఏ ప్రజల ఓట్లతో గెలిచి అక్కడికి వెళ్ళాడో ఆ ప్రజల వెన్నుపొటు పొడిచి, ఈ రోజు మానవహరంలో నవ్వుతూ చూస్తా ఉన్నాడు.

కె.వి.పి. రామచంద్రరావు:  ఇతనికి ఏకైక లక్ష్యం మిత్రుడు రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో ఉంచి ప్రజల్ని ఇంకా దోపిడి చేయడానికి మద్దతు ఇచ్చి నిలబెట్టగలిగే పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.

డి. శ్రీనివాస్: ఒక వైపు తిడతా ఉంటాడు. మరొ వైపున మెచ్చుకుంటా వుంటాడు.  అయినా గాని ఆ దోపిడిలో భాగస్వామ్యన్ని అనుభవిస్తూనే వుంటాడు.

జైపాల్‌రెడ్డి: లోపల రాజశేఖర్ రెడ్డిని తిట్టూకుంటూ అలా చూస్తునే వుంటాడు .. ఏమీ చేయడతను ..

టి.సుబ్బిరామిరెడ్డి: వైజాగ్ బీచ్‌లో కూర్చుని సర్వేజనా సుఖినో‌భవంతు అని చెప్పి “ఓం నమశ్శివాయ” “ఓం నమశ్శివాయ” “ఓం నమశ్శివాయ” అని తప్పస్సులు చేస్తా ఉంటాడు. సర్వేజనా సుఖినో‌భవంతు అని చెప్పి సర్వజన దోపిడి చేసే కాంగ్రెస్ భక్తుడు. 

షబ్బీర్ ఆలీ: దేశద్రోహి. బాద్యతాయుతమైన్ మంత్రిగా ఐ.ఎస్.ఐ ఏజెంట్ దగ్గరకు వెళ్ళి వాళ్ళను సమర్దించిన ఘనుడు. ముస్లింలకు చెందాల్సిన వక్ఫ్ బోర్డ్ ఆస్తులను వారికి కానీవ్వకుండా చేసిన నెం.1 దుర్మార్గుడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు. Bookmark the permalink.

20 Responses to ఇరగదీసిన పవన్‌కల్యాణ్

  1. koodali అంటున్నారు:

    రాజకీయలంటే అధికార దుర్వినియోగం. ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై వ్యక్తిగత విమర్శల తో దారి మళ్ళించి, సమస్యల గురించి చర్చ లేకుండా చేసే రాజకీయ నాయకులు.

  2. siva అంటున్నారు:

    pavankalyan iragadheesadu

  3. Sudhakar అంటున్నారు:

    yes, I totally agree with his voice and concerns. Not sure why he left YSR and other political leaders …

  4. ఏకాంతపు దిలీప్ అంటున్నారు:

    ఏంటి ఇరగదీసింది. చేసినవన్నీ మీ లెక్క ప్రకారం వ్యక్తిగత విమర్శలే. ఆధారాలు ఆధారాలు అనే a2z గారికి ఇక్కడ పాపం ఆధారాలు అవసరం లేదనుకుంట. అదే చిరంజీవి 5 కోట్లు తీసుకుంటున్నాడు అని ప్రజలు ప్రశ్నిస్తే ( ఆ అడిగే వాడికి పవన్ కన్నా మంచి అవగాహనే ఉంటుంది ) మాత్రం ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా విమర్శించకూడదు పాపం అభిమాన నటుడుని… అందుకే అనేది అభిమానం కళ్ళు మూసుకునేట్టు చేస్తుంది అని. అభిమాన నటుడు నాలుగు డైలాగులు చెప్పేసరికి ఇరగదీసాడు అని కాప్షన్ పెట్టేసారు. అవసరమా అక్కడ ఆ విమర్శలు. జైపాల్ రెడ్డి ని కూడా వదలలేదు పిల్లోడు. పూర్తిగా అనుభవ లేమి కనపడుతుంది. ఆలోచన ఉన్న వాడైతే అలా చెయ్యడు.

    ఎక్కడో రాజకీయాలు చెయ్యొద్దు అని చెప్పారు. మీరు చేస్తున్నదంతా రాజకీయమే. మంచి రాజకీయం కూడా కాదు. డబ్బుని, గూండాలని ప్రోత్సహించే రాజకీయం. మీరు అభిమానించే వాళ్ళకి పక్షపాతం చూపే రాజకీయం. మీరు అభిమానించే వాళ్ళు ఏం చేసినా విమర్శించలేని రాజకీయం. మీరు అభిమానించని వాళ్ళు ఏంచేసినా విమర్శించే రాజకీయం.

  5. a2zdreams అంటున్నారు:

    ఏకాంతపు దిలీప్ గారు, తెలుగు దేశం నుంచి కాంగ్రెస్ కి షిప్ట్ అయ్యారా ?

    వాళ్ళు భాద్యత గల ప్రజా నాయకులు సార్ .. వాళ్ళ బాద్యతలను ప్రశ్నించడం వ్యక్తిగతమా ?

  6. hemachendra అంటున్నారు:

    పవన్ నిజంగానె ఇరగ తిశాఢు రాజకియ నాయకుల గురించి వారి అవినితీ గురించి తౌలిసారె బాగా చప్పగలిగాఢు

  7. రాజారావు తాడిమేటి అంటున్నారు:

    ప్రజారాజ్యం పార్టీలో రౌడీ గా వ్యవహరించే విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడిని చేర్చుకోవడం వెనుక మర్మమేమిటో పవన్ కే తెలియాలి. తమ పార్టీలోనే రౌడీలను చేర్చుకొంటూ, వారు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వస్తున్నారు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రజలు కోరుకొనే మార్పును ఇలాంటి పాత నాయకులతో ఎలా సాధించగలరన్నది చిరంజీవికే తెలియాలి. మాటలు చెప్పడం సులువు, ఆచరణలో చేసి చూపగలగడం ఎంతో కష్టం. పార్టీలో ఇలాంటి వారికి చోటును నిర్మొహమాటంగా నిరాకరించి ఉండి ఉంటే చిరంజీవి, పవన్ ల మాటపై ప్రజలకు ఈ పాటికే నమ్మకం కుదిరి ఉండేది. ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ అధికారాన్ని చేపట్టడం వారు అనుకున్నంత సులువు కాదని నాకు అనిపిస్తోంది.

  8. ఏకాంతపు దిలీప్ అంటున్నారు:

    కొంచెం మర్యాద ఇస్తూ చర్చించండి, నాకు వేరే పార్టీని అంటగట్టకుండా! నేను ఇక్కడ మిమ్మల్ని, పవన్ ని విమర్శిస్తే ఆ పార్టీలకోసం మాట్లాడినట్టా? చాల ఛండాలంగా ఉంది మీ ఆక్షేపణ!

    అహా! అలానా? మరి చిరంజీవి ప్రజా జీవితంలోకి రాలేదా? అతన్ని విమర్శిస్తే మాత్రం వ్యక్తి గత చవక బారు విమర్శలూ.. వాటిని ఆపెయ్యాలి… పవన్ వెళ్ళి ఇంకోకళ్ళని విమర్శిస్తే ప్రజా నాయకులు, వారికి భాధ్యత ఉంది అంటున్నారు.

    మీరే అర్ధం చేసుకోండి మీ పక్షపాతాన్ని! ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది…

    నాకు పార్టీలు అంటగట్టే ప్రయత్నం చేసిన మీరు రాసే ఈ బ్లాగుని బహిష్కరిస్తున్నా. అభిమానంతో కళ్ళు మూసుకుపోయిన ఒక పక్షపాతితో చర్చలో పాల్గొనడం వ్యర్ధమని ఇంకోసారి తెలుసుకున్నా..

  9. a2zdreams అంటున్నారు:

    ఏకాంతపు దిలీప్ గారు, ఏది వ్యక్తిగతమో, ఏది సామాజికమో, ఏది పార్టీగతమో అని అవగాహన లేకుండా మీరు ఏదేదో రాసేస్తున్నారు…

    కానివ్వండి… మీరు ఎలా అర్ధం చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి…

  10. ammulu అంటున్నారు:

    chaakrevu vaadu deeniki muktaaimpaa annattu “తనకోపమే తన శత్రువని పవన కుమారుడు” ani vraasaadu ikkada http://chaakirevu.wordpress.com/2008/12/31/

  11. KRISHNA RAI JALLIPALLI అంటున్నారు:

    పవన్ కొత్తగా ఇరగదీసింది ఏమి లేదు. ఈ విషయాలు అందరికి తెలిసినవే. ఇంతకీ కోతి రూపాయిల ఫండ్ ఎమయ్యందో.

  12. సత్య అంటున్నారు:

    ఏకాంతపు దిలీప్ గారు,

    ఆధారాలంటే కనీసం పత్రికా వార్తల లాంటివైనా అని.. చిరంజీవి 5 కోట్లు తీసుకుంటున్నాడని ఇప్పటివరకు ఏ సాధారణ పత్రికలో కూడా రాలేదు. (సాక్షి గురించి తెలీదు). A2Z మాట్లాడింది అటువంటి ఆధారాల గురించే అనుకుంటున్నా. అభిమానం బ్లాగులో వాళ్ళకి కళ్ళు మూసుకునేలా చేసి ఉండచ్చు, కానీ పవన్ సభ కి వెళ్ళింది, అక్కడ ఉన్న ప్రజలు అభిమానులు కాదుగా. ఇంక తను చేసింది రాజకీయ విమర్శలే. వ్యక్తుల పేర్లు చెప్తేనే వ్యక్తిగత విమర్శలు అయిపోవు. వ్యక్తి గత విమర్శలు అంటే ఉదాహరణకి
    డాన్సులు వేసుకునే వాడికి రాజకీయాలు ఏం తెలుసు?
    ఒక అమ్మాయిని చేసుకుని, ఇంకో ఆమెతో కాపురం ఏంటీ?
    సొంత ఇంటిని చక్కదిద్దుకోలేదు, రాజకీయాలా?
    –ఇలాంటివన్నీ
    జైపాల్ రెడ్డి ఎమైనా విమర్శలకి అతీతుడా? మిర్యాలగూడ కి ఏం చేసాడు ఆయన? ఎంపి అయినా కూడా ఆయనకు ఎన్నుకున్న ప్రజల సమస్యల కంటే పార్టీ వ్యవహారాలే ఎక్కువ..
    పైన చేసిన విమర్శలలో ఏది అబద్దం అని మీ భావన? చిరంజీవి ఎప్పుడు ఘాటుగా విమర్శించకుండా subtle గా మాట్లాడుతాడు కాబట్టి పవన్ ఇరగతీసాడు అనుండవచ్చు, భయపడకుండా పేర్లు పెట్టే విమర్శించినందుకు.

    అయితే చిరంజీవి ఏదొ గొప్పగా ఉద్దరిస్తాడు అనే ఆశ తగ్గుతుంది అనే విషయం నిజం. సంస్థాగత, ప్రణాళికా లోపాలు చాలా ఉన్నాయి. నిజమైన మార్పంటే చూసినంతలో లోక్ సత్తా ద్వారానే సాధ్యం అనేది అంతా ఒప్పుకుంటారు.

    మీరు అభిమానం తో కళ్ళు మూసుకొనే బ్లాగుని బహిష్కరిస్తా అంటున్నారు, కానీ నిజంగా తను అంత అభిమానం చూపితే మీ కామెంట్లు కూడా ప్రచురించనక్కర్లేదు. అంతే కాదు, తన గత టపా ఒక్కసారి చూడండి.

    చివరగా దిలీప్, మీ నిజాయితీ కి ఒక ప్రశ్న,
    మీరు చాకిరేవు బ్లాగుని బహిష్కరిస్తున్నారా? దీని సమధానం మీద మీ అభిమానం ఏంటో తెలుస్తుంది..

  13. srilu అంటున్నారు:

    ” మీరు అభిమానించని వాళ్ళు ఏంచేసినా విమర్శించే రాజకీయం”
    మరి మీరు ఇప్పుడు చేస్తోంది ఏమిటి :-?@ఏకాంతపు దిలీప్

    సత్య గారు చాలా బాగా చెప్పారు 🙂

  14. చిలమకూరు విజయమోహన్ అంటున్నారు:

    రాజకీయమే ఓ అడుసు ,దాంట్లో రాళ్ళేస్తే మనకే చిట్లేది. అభిమానులెట్లా వీధుల్లో ఎలాగూ కొట్టుకుంటున్నారు, మళ్ళీ బ్లాగులోకంలోనూనా.ఎందుకొచ్చిన బాధలు వీళ్ళెవరూ తీర్చలేరు మనబాధల్ను,తీరుస్తామని నిజాయితీగా చెబుతున్న వారికెలాగూ మనం వోట్లు వెయ్యం. ఇక్కడ వ్యక్తిగత అభిమానాలొద్దు సమాజానికి ఎవరు మంచి చేస్తారో ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

  15. deleep అంటున్నారు:

    సామజిక న్యాయం గురించి మాట్లాడకుండా,నీతులు వల్లిస్తు,అవసరమైనచొట ఆచరణలొ
    పనికిరాని లొక్ సత్హ పార్టి ని అడ్డం పెట్టుకొని ప్రజారాజ్యం ని విమర్సించడమేపనిగాపెట్టుకున్నారు.ఏకాంతం దిలీప్ గారు ఈ బ్లాగు లొ పాల్గొనకపొతే పొయెది ఏమీ లెదు

  16. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం

  17. Venkat అంటున్నారు:

    ayya ekaanthapu Dhileep gaaru meerendhuku maarpunu vyathirekisthunnaru, Congress ni choosaaru, TDP ni choosaaru, okka saari PRP ni choodochu kadha, kaani evvaru vachina Congress lo jariginantha avineethi dhenilo jaragadu, dhayaachesi meeru ee blog lo participate cheyyanakkarledhu plzzzz….

  18. vamsi అంటున్నారు:

    @satya said truth. i dont know about last phase. though lok satta is good, satya kind of guy should stand prajarajyam and guide in right direction. no doubt – chiru image lead win people votes

  19. jaya అంటున్నారు:

    andhralo umtu, ikkade sampadistu,yenadu prajala kosam 1 rupee gani 1 nimisham time gani, oka manchi mata gani leni valla kosam manaki imta discussion avasarama?

  20. satya అంటున్నారు:

    @Vamsi, Thank you. Yesterday I read a statement from JP in which he revealed a conversation happend 10 months back between him and Chiranjeevi. he said that if he chiru could follow some basic principles that JP has suggested to change the current political scenario, then he will make chiru the next CM by all his efforts. I couldn’t understand why chiru rejected such a proposal..that too from a person like Jaya Prakash Narayan. Thats why I little doubt the path that Chiru has taken. However, I believe as he is new comer to politics he won’t stoop down to a level where Congress and some leaders in TDP are getting to.

    I am eagerly waiting for the PRP’s manifesto, which reflects how better PRP understands/identifies the problems that ppl are facing..

వ్యాఖ్యలను మూసివేసారు.