నేను

బయట ప్రపంచానికి కనిపించే నేను, నేను కాదు.

నేను రోజూ ఎన్నో అబద్దాలు ఆడుతుంటాను. నేను ఆడే ప్రతి అబద్దం నాకు ఆ క్షణంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ? .. ఆ ఆనందం శాశ్వతమా అనేది నాకు అనవసరం.”

నేను అబద్ధాలు ఆడటం నిజమా ? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకోచ్చే సమాధానం “కాదు”. ఇది మరొక అబద్దం.

నా గురించి నాకు తప్ప, ప్రపంచానికి అనవసరం అని తెలుసు. కాని నా గురించి ప్రపంచానికి ఎదో చెప్పుకొవాలని ఆరాటం.