అందితే జుట్టు, అందకపొతే కాళ్ళు .. అల్లు అర్జున్‌ అసలైన క్యారెక్టర్‌

అల్లు అర్జున్‌కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. మే 4 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ ఈరోజు చేసారు. ఈ ట్రైలర్‌ లో డైలాగ్స్ అల్లు అర్జున్ నిజ జీవితంలో క్యారెక్టర్‌ కూడా ఇలానే వుంటుందనే ఫీల్ వచ్చేలా జనాలు అర్దం చేసుకొవాలన్నట్టు కట్ చేసారు.

‘క్యారెక్టర్‌ వదిలేయడం అంటే.. ప్రాణాలు వదిలేయడమే.. చావు రాకముందు చచ్చిపోవడమే’ అంటున్నాడు అల్లు అర్జున్‌.

‘బిర్యానీ చాలా బాగుంది. రుచిగా ఉంది’ అని జైలులో ఉన్న ఖైదీ అంటే ‘ఇదే నీ ఆఖరి బిర్యానీ. ఇది తినేసరికి నిన్ను చంపేస్తా’ అనే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్‌తో పాటు, ప్రేమ, కుటుంబం అనుబంధాలను మేళవించి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చివర్లో శరత్‌కుమార్‌ ‘నీకు ఏం కావాలి రా!’ అని అడిగితే ‘ఇండియా కావాలి. ఇచ్చేయ్‌’ అనే సంభాషణ ఆకట్టుకుంటోంది.

రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషా- శ్రీధర్‌ లగడపాటి, బన్ని వాసులు నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ అందించిన గీతాలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శరత్‌కుమార్‌, అర్జున్‌, బొమన్‌ ఇరానీ, రావు రమేష్‌, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా మీద అసలు హైప్ లేదు. హైప్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 1) ఆఖరి సాంగ్ షూటింగ్ కు చిరంజీవిని పిలిచి, చిరంజీవితో ఆ చిత్రయూనిట్ ఫోటోలు రిలీజ్ చేసారు. 2) ఆడియో ఫంక్షన్ కాస్తా పవన్ కల్యాణ్ ఫంక్షన్ చేసారు 3) రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా ప్రిరిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు.

bottomline:
మెగాఫ్యాన్స్ పబ్లిక్ గా అవమానించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి అల్లు అర్జున్ కి ఇగో అడ్దు వస్తుంది. వేరే రూట్లో, నేను కూడా మెగాఫ్యామిలీనే అని సిగ్గు వదిలేసి చిరంజీవి, పవన్ కల్యాణ్ & రామ్‌చరణ్ లని మళ్ళీ వాడుకుంటున్నాడు.  స్టైలిష్ కాదు కన్నింగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు.  భారీ ఒపినింగ్స్ కావాలి కదా.

అందితే జుట్టు, అందకపొతే కాళ్ళు .. అల్లు అర్జున్‌ అసలైన క్యారెక్టర్‌. ఈ విషయాన్ని కూడా ట్రైలర్లో చెపితే బాగుండేదని అంటున్నారు, ఇంకా అల్లు అర్జున్ మీద కోపం తగ్గని మెగాఫ్యాన్స్.

తెలుగుహిరోలు అందరికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హాడావుడి చేస్తారు కాని, అల్లు అర్జున్ కి మాత్రం ఫ్యాన్స్ తో పని లేకుండా, సొంత టీం వుందని పబ్లిక్ టాక్.

 

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, News. Bookmark the permalink.