హాస్యం, వెటకారం పేరుతొ పైశాచిక ఆనందం పొందే వాళ్లకు ..

పెద్దాయనతో నా సంభాషణ నాకు కొన్ని నిజాలు తెలిసేలా చేస్తూ వుంటుంది. నా బ్లాగులోనే కాదు, వేరే బ్లాగులలో కూడా నా మీద వస్తున్న కొన్ని కామెంట్స్ కు కారణాలు ఏమిటి అనేది నివృత్తి చేసుకుందామని పెద్దాయనకు కాల్ చేసాను.

నేను: సార్, హాస్యం వెటకారం పేరుతొ పైశాచిక ఆనందం పొందే జీడిపప్పు గారి బ్లాగులో నాపై కామెంట్ ఇది సార్.

రెండో బ్లాగులో “అసలు మా మెగాజోకర్ గారు ఓడిపోలేదు”, “మెగాజోకర్ గారూ, మీ వెంటే మేముంటాము”, “వచ్చే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి మెగాజోకర్ గారూ”, “మీరు చాలా మంచివారు మెగాజోకర్ గారు” “అసలు మెగాజోకర్ ఎవరు” లాంటి పోస్టులు వేస్తాను, మతి చలించినప్పుడల్లా లేదా మతి ఉన్నపుడల్లా.

నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి సార్ ?

పెద్దాయన: వెటకారం పేరుతొ పైశాచిక ఆనందం పొందే జీడిపప్పు అంటున్నావు ?. అసలు ఆ కామెంట్ నీ మీదే అని నీకెలా తెలుసు.

నేను: నా ఉహా. అంతే.

పెద్దాయన: పోస్టులు తగ్గించు. చిరంజీవిని పొగడటం మానెయ్యి.

నేను: మీ సలహా బాగుంది.

నేను: నన్ను వెటకారం చెయ్యడం తప్పు కాదంటారా ?

పెద్దాయన: నిన్ను ఎవరైనా పొగిడితే ఫీల్ కానోడివి, విమర్శిస్తే అంత ఫీల్ అవ్వవలసిన అవసరం ఏమిటి ? ఆయన అన్నది వున్నమాటేగా.

నేను: నాకు అది విమర్శ గా లేదు. విమర్శ సున్నితం గా వుండాలనుకునే నాకు, ఆ కామెంట్ బండ బూతులు తిట్టినట్టుగా వుంది. అలా పైశాచిక ఆనందం పొందే వాళ్లకు ఒక బూతు బిరుదు ఇద్దాం అనుకున్నాను. విమర్శ సున్నితం గా వుండాలనుకునే నేను, అటువంటివి ఘాటుగా వ్రాస్తే నా ఆలోచనలకు అన్యాయం చేసినట్టు అని గమ్మున వున్నా.

పెద్దాయన: ఒక్కొకరికి ఒకో తీరు వుంటుంది. దానికి అంత ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ కామెంట్ నువ్వు అనుకున్నంతగా లేదు.

నేను: ఈయనే కాదు. నా బ్లాగులోనే కొన్ని కామెంట్స్ “నీ చిరంజీవి గోల ఆపు బాబు” అంటూ రిక్వెస్ట్ కాదు .. ఆర్డర్లు చేస్తున్నారు. రిక్వెస్ట్ చెయ్యాలి కానీ, ఈ ఆర్డర్లు ఏమిటి సార్ ? .. నా మీద అధికారం వీళ్ళకు ఎవరిచ్చారు ?

పెద్దాయన: నువ్వు ఒకటి గమనించాలి. నిన్ను బ్లాగు వ్రాయవద్దు అని ఎవరూ అనటం లేదు. కూడలి మెయిన్ పేజిలో అన్నీ టపాలు నీవే ఆక్రమించుకోవడం మూలానా, మంచి టాపాలు మిస్ అయిపోతున్నారని వారి ఆవేదన.

నేను: ఓహో ..

పెద్దాయన: అందుకనే పోస్టులు తగ్గించమన్నాను.

నేను: సార్, నేను బ్లాగు వ్రాసేది .. నా కోసం .. నా ఆనందం కోసం ..

పెద్దాయన: రామాయణం అంతా విని .. రాముడికి సీత ఏమవుతాది అన్నట్టు వుంది. నీ చెత్తతో కూడలిని చెత్త చెయ్యవద్దు అని వారి డిమాండ్.

నేను: ఓహో .. మరి కూడలి నుంచి తప్పుకోమని సలహా ఇవ్వకుండా , నన్ను ఎందుకు పోస్టులు తగ్గించమన్నారు ?

పెద్దాయన: నీ ఇష్టం నాయనా !

నేను: ఇది బాగుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.

3 Responses to హాస్యం, వెటకారం పేరుతొ పైశాచిక ఆనందం పొందే వాళ్లకు ..

  1. Sreenivas అంటున్నారు:

    నాకు ఈ కూడలి అంటె తెలియదు గాని, జీడిపప్పు బాద మాత్రం అర్థం అవ్వటం లేదు, మంచి పొస్ట్సు చూదలెకపొతున్నాం అంటున్నాడు, అస్సల మంచి పొస్టు అంతె ఎమిటి అవి ఎల ఉండాలి అని ఒక పుస్థకం రాసి తన బ్లాగు లొ చెప్తె అందరు పాటించవచ్చును కద.

  2. kumar అంటున్నారు:

    Dont worry to such selfish posts. I have seen the jeedipappu blog which you mentioned. He is jealous that his blog is not highlighted in koodali. He doesnt know what is the meaning of blog. It is wrong of him to think that only his blogs are good/ should be read. If he posts only one blog per day should every one do the same way?

  3. మార్తాండ అంటున్నారు:

    జీడిపప్పుకి తెలుగు దేశం పార్టీ మీద అభిమానం ఉన్నంతమాత్రాన ఇతర పార్టీల అభిమానులు గురించి అలా వ్రాయడం బాగాలేదు. ప్రజారాజ్యం పేరు చెపితేనే ఝడిసిపోవడం చూస్తే అతను తెలుగు దేశం కార్యకర్త అని అర్థమవుతోంది.

వ్యాఖ్యలను మూసివేసారు.