చైనాలో రిలీజ్‌కు సిద్ధమైన ‘బాహుబలి’!

Bahubali

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు ‘ఇంటర్నేషనల్ కట్’తో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చే క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఉన్నారు.

“బాహుబలి కంటెంట్” .. “గ్రాఫిక్స్ స్టాండర్డ్స్” .. “అంచనాలు రీచ్ అవ్వడవం”పై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా వున్నా, అందరూ ఏకగ్రీవంగా అంగీకరించవలసిన విషయం “ఈ సినిమా కమర్షియల్ సక్సస్”. రాజమౌళి ఈ సక్సస్‌పై ఏమి డ్రీమ్ చేసాడో అదే విధంగా జరుగుతుంది. ఈ కమర్షియల్ సక్సస్ చూసి “అంచనాలు రీచ్ అవ్వలేదు” “గ్రాఫిక్స్ అక్కడక్కడా పేలవంగా వున్నాయి” “ప్రభాస్‌ను హైలట్ చెయ్యలేదు” “సగం సినిమానే చూపించారు” అని విమర్శలు చేసినోళ్ళు కూడా రాజమౌళి విజన్‌కు సలాం కొట్టవలసిందే.

స్టార్స్ ఫిస్ అనే సంస్థ బాహుబలి సినిమాను చైనాలో సుమారు 5000 థియేట్ర్లలో పెద్ద ఎత్తున విడుదల చేయనుందనే న్యూస్ ప్రతి తెలుగోడి ఒంట్లో గుగుర్పాటు కలుగుజేస్తుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి. Bookmark the permalink.